ఒకప్పుడు విదేశాల్లో నివసించడం ఓ పెద్ద కల. ఇప్పుడు సాంకేతిక విప్లవం వల్ల ప్రపంచం కుగ్రామం అయిపోయింది. దేశాల మధ్య సరిహద్దుల్నీ, దూరాన్నీ చెరిపేసింది. బతకడం విషయానికొస్తే ఇండియాను మించిన ప్రదేశం మరొకటి లేదని చెబుతోంది హీరోయిన్ అనుష్క.
విదేశాల్లో అన్ని సౌకర్యాలు వున్నా, ఆదరించే మనుషులు కరువవుతారు. పైగా అక్కడ రక్తపాతం కూడా ఎక్కువే. టెన్ డాలర్స్ కోసం షూట్ చేసే బ్లాక్స్ కూడా వుంటారు. ఇండియాలో ఎంతో భద్రత వుంటుంది. మన బంధువులు ఎల్లవేళలా అందుబాటులో వుంటారని అనుష్క ఎందుకు చెబుతుందో అర్థం కాక విన్నవారు బుర్రగోక్కున్నారు.
బహుశా అనుష్కకు విదేశీ సంబంధాలు వస్తున్నాయి కాబోలు.. లేదా ఏ పారిశ్రామికవేత్తో పెళ్ళాడి విదేశాల్లో కాపురం పెడదామనే షరతు పెట్టి వుంటాడు. అందుకే అలా విదేశాల్లో వుండటం ఇవ్వలేదని ఇండైరెక్ట్‌గా చెబుతుందేమోననే సందేహంతో అనుష్క చెప్పిన దేశభక్తికి తలలు ఊపి వచ్చేశారు జర్నలిస్టులు.