ప్రేమించినవాడినే పెళ్ళి చేసుకోవాలనేది నియమం. ఇంకా లోతుల్లోకి వెళితే ఆడపిల్లలు తమ తల్లిదండ్రులు వెదికి పెట్టినవాడినే పెళ్ళాడటం సంప్రదాయం. ఇప్పుడవన్నీ చాదస్తంలా కనిపిస్తున్నాయి కాబట్టి.. ప్రేమలూ డేటింగ్‌లూ లేదా సహజీవనం ఎక్కువైపోయాయి. ఆ క్రికెటర్‌తో ఎన్నాళ్ళయినా తిరుగుతా.. అతని రూంలోనే నిద్రపోతా.. ఏ దేశం వెళ్ళినా కూడా అతని వెంటే వెళతా.. కానీ అతన్నే పెళ్ళి చేసుకోవడం కుదరని పని.. అంటోంది హిందీ భామ అనుష్క శర్మ.
క్రికెటర్ విరాట్ కోహ్లీతో ఈమెకున్న సంబంధం గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తున్న విరాట్ కోహ్లీతో అనుష్క శర్మ కూడా తట్టా బుట్టా సర్దుకుని బయల్దేరింది. అమ్మాయిల్ని తెచ్చుకుని రాత్రంతా సుఖపడిపోతే, పొద్దున్నే క్రికెట్ బాగా ఆడతారని విదేశీయులు నిరూపించారు కాబట్టి, మనోడు కూడా అనుష్కని తీసుకుని బయల్దేరాడు. అంతమాత్రాన వాడినే పెళ్ళాడాలని రూలేం వుంది. శృంగారం వేరు, ప్రేమ వేరు, పెళ్ళి వేరు.. ఈ మూడూ వేటికవే.. అని కొత్త భాష్యం చెబుతున్న అనుష్క శర్మని అన్నీ తెలిసినవాడే పెళ్ళాడతాడని ఆశిద్దాం.