దీన్నీ కెలికేస్తున్నాడా?

హీరో రామ్ మీద ఇండస్ట్రీలో వున్న అంత్యంత కీలమైన గ్యాసిప్ ఏమిటంటే, సినిమాలను కెలికేస్తాడని. డైరక్టర్ ను కుర్చీలో కూర్చోబెట్టి, తానే చేసేస్తాడని. స్రవంతి రవికిషోర్ మాట కూడా వినడని. అదెంతవరకు నిజమో కానీ,…

హీరో రామ్ మీద ఇండస్ట్రీలో వున్న అంత్యంత కీలమైన గ్యాసిప్ ఏమిటంటే, సినిమాలను కెలికేస్తాడని. డైరక్టర్ ను కుర్చీలో కూర్చోబెట్టి, తానే చేసేస్తాడని. స్రవంతి రవికిషోర్ మాట కూడా వినడని. అదెంతవరకు నిజమో కానీ, సినిమాలైతే ఆశించిన పలితాలు ఇవ్వడంలేదు. పండగచేస్కో కాస్త బెటర్ అనుకుంటే, ఆ తరువాత వచ్చిన శివమ్ దారుణంగా దెబ్బ తీసింది.

ఇప్పుడు హరి కథ సినిమా ముస్తాబు అవుతోంది. కిషోర్ దర్శకుడు. ఈ సినిమా విషయంలో కూడా రామ్ అన్ హ్యాపీగా వున్నాడని, కొన్నిసీన్లు తీసేసి, మరి కొన్ని సీన్ల రీషూట్ చేసి, అవసరమైతే కొన్ని సీన్లు జోడించమని చెబుతున్నాడన్నది లేటెస్ట్ గ్యాపిస్. తను చేతులు, కాళ్లు పెట్టిన శివమ్ ఫలితం చూసిన తరువాత కూడా ఇలా మళ్లీ చేస్తున్నాడంటే, రామ్ కు తన మీద, తన ప్రతిభ మీద మితిమీరిన నమ్మకం వుండివుండాలి.