ముదిమి మీదపడ్డాక ముద్దా?

శ్రీదేవి..సౌత్ సినిమానే కాదు, బాలీవుడ్ ను కూడా ఓ ఊపు ఊపేసిన నటి. మొన్నటికి మొన్న కూడా ఇంగ్లీష్-వింగ్లీష్ తో తన స్టామినా చాటింది. అయితే ఇప్పుడు విషయం ఏమిటంటే, దాదాపు ఇరవై తొమ్మిదేళ్ల…

శ్రీదేవి..సౌత్ సినిమానే కాదు, బాలీవుడ్ ను కూడా ఓ ఊపు ఊపేసిన నటి. మొన్నటికి మొన్న కూడా ఇంగ్లీష్-వింగ్లీష్ తో తన స్టామినా చాటింది. అయితే ఇప్పుడు విషయం ఏమిటంటే, దాదాపు ఇరవై తొమ్మిదేళ్ల తరువాత స్ట్రయిట్ తమిళ సినిమా చేస్తోంది శ్రీదేవి.

తెలుగు, హిందీ రంగాలకు విస్తరించాక తమిళ సినిమాలు పెద్దగా చేయలేదు. ఇప్పుడు విజయ్ 58 సినిమాలో నటిస్తోంది. నిజానికి ఇది వర్కింగ్ టైటిల్. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో విజయ్ తో పాటు, సుదీప్, శ్రీదేవి కూడా నటిస్తున్నారు. మన దేవి సంగీతం అందిస్తున్నాడు. హీరో విజయ్ సినిమాలకు సంబంధించి ప్రెస్ వ్యవహారాలు చూసే సెల్వకుమార్ నిర్మాత. 

ఫాంటసీ స్టోరీతో తయారయ్యే ఈ సినిమాలో శ్రీ దేవి మహారాణి పాత్ర పోషిస్తోంది. ఇందుకోసం ఆమెకు అయిదుకోట్ల వరకు పారితోషికం తీసుకుంటోంది. అయితే కేవలం పాత్ర కోసమే కాదు., సినిమాలో ఆ ఆంటీ పాత్రకు ఓ లిప్ లాక్ సీన్ వుందని వినికిడి. అందుకోసమే అంత డిమాండ్ అంటున్నారు.