సినిమా ప్రమోషన్‌కి పెర్‌ఫెక్ట్‌ ‘షో’

అలీ టాక్‌ షో.. సినిమా ప్రమోషన్‌కి పెర్‌ఫెక్ట్‌ షో.. అని ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది అనుకుంటున్నారు. కారణం, అలీ టాక్‌ షో అతి తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీని సంపాదించడమే. ఆద్యంతం…

అలీ టాక్‌ షో.. సినిమా ప్రమోషన్‌కి పెర్‌ఫెక్ట్‌ షో.. అని ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది అనుకుంటున్నారు. కారణం, అలీ టాక్‌ షో అతి తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీని సంపాదించడమే. ఆద్యంతం హాస్యంతో (కాస్త ఊర మాస్‌..) అలరిస్తోన్న అలీ టాక్‌ షోలో, ఆ టైమ్‌లో విడుదలకు సిద్ధంగా వున్న, విడుదలైన సినిమా టీమ్స్‌ పాల్గొంటూ, తమ సినిమాల్ని ప్రమోట్‌ చేసుకుంటున్నాయి.

ఇటీవలి కాలంలో టీవీల్లో బాగా టీఆర్పీ రేటింగులు సాధిస్తోన్న ప్రోగ్రామ్స్‌లో అలీ టాక్‌షోని ప్రముఖంగానే చెప్పుకోవాలి. అలీ ఇప్పటికే చాలా షోలు చేసినా, వాటన్నిటికీ భిన్నంగా సాగుతోంది అలీ టాక్‌ షో. మామూలుగా అయితే స్టేజ్‌ నిండా ఎక్కువమంది కన్పిస్తే గందరగోళంగా తయారవుతుంది. అయితే అలీ టాక్‌షోలో ఎంత ఎక్కువమంది కన్పిస్తున్నా.. షో మాత్రం సందడిగానే సాగుతోంది.

గ్లామర్‌ పరంగా చూస్తే అలీ టాక్‌ షోలో అనసూయ కాస్తంత హడావిడి చేస్తున్నా, అస్తమానూ అలీ తనదైన సెటైర్లతో అనసూయ గాలి తీసేస్తుండడం గమనార్హం. బుల్లితెర స్టార్‌ యాంకర్స్‌లో ఒకరైన రవి, సింగర్‌ మనో, పలువురు కమెడియన్లు అలీ షోకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌.. దాంతోపాటుగా, సినిమా ప్రమోషన్లకి ఉపయోగపడ్తుండడం వెరసి అలా టాక్‌ షో సూపర్‌ సక్సెస్‌ అవుతోంది.