నిర్మాతలకు ఫైనాన్సియర్లకు ఎప్పుడూ ఎక్కడో ఓ పాయింట్ దగ్గర వివాదం తప్పదు. ఎందుకంటే అన్ని రోజులు ఒకలా వుండవు కదా. ఏదో సినిమా దగ్గర తేడా వస్తుంది..ఫైనాన్షియర్ చూసి చూసి కోర్టు గుమ్మం ఎక్కుతాడు. నీ జతగా నేనుండాలి సినిమా, ఆ తరువాత టెంపర్ వ్యవహారాల్లో ఫైనాన్స్ కమ్ నిర్మాణ సంస్థ వైకింగ్ తో నిర్మాత బండ్ల గణేష్ కు చెడింది.
అలాగే పివిపి ఫైనాన్స్ సంస్థకు, నిర్మాత అశ్వనీదత్ కు చెందిన వైజయంతీ మూవీస్ కు కూడా చిన్న తేడా వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి టాలీవుడ్ లో. అయితే ఇది కోర్టు గుమ్మం దాకా వెళ్లేదే కానీ, డిస్కషన్ ల్లో వుందని, సెటిల్ మెంట్ దిశగా నడుస్తోందని కూడా వదంతులు వినిపిస్తున్నాయి.