మెగాస్టార్ చిరంజీవి నటించే 151,152,152, సినిమాలకు కథలు, డైరక్టర్లు రెడీ అయిపోయారట. కేవలం 150 కి మాత్రం…స్పెషల్ గా చూస్తు్న్నారు కాబట్టి డిలే అవుతోదంట. ఇది చెప్పింది ఎవరో అయితే ఏమోఅనుకోవచ్చు..రామ్ చరణ్ నే అన్నాడు కాబట్టి నమ్మాలి.
150కి సరైన కథ కత్తి అనిపిస్తోంది కాబట్టి, అటు ఆలోచిస్తున్నామని, అందులో తప్పేముందని చెర్రీ ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పాడు. అన్నీ రీమేక్ సినిమాలే చేస్తే, మనకు కథకులు లేరా అని క్వశ్చన్ చేయవచ్చని, అన్నీ చేస్తున్నపుడు ఆ ఫ్రశ్న రాదని అంటున్నాడు.
150ని కాస్త స్పెషల్ గా చూస్తున్నాం కాబట్టి కథ డిలే అవుతోందని, నిజానికి 151,152,153 కథలు రెడీ అయిపోయాయని అంటున్నాడు. అంటే భూపతి రాజా ఇచ్చిన కథ, 151 కోసం అల్లు అరవింద్ దాచుకున్నారన్నది నిజమే అనిపిస్తోంది.
అయితే మళ్లీ చరణ్ కత్తిని కచ్చితంగా రీమేక్ చేస్తున్నాం అని అంగీకరించడం లేదు..ఆలోచిస్తున్నాం అని మాత్రమే అంటున్నాడు. అవసరమైతే 151,152,153ల్లో ఏదయినా 150కి షిప్ట్ అవ్వొచ్చు అని కూడా అంటున్నాడు. ఏంటో ఈ గందరగోళం?