చందు మొండేటి..కార్తికేయ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చాడు. నాగ చైతన్య కోసం మంచి సబ్జెక్ట్ రెడీ చేసాడు. స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తి కావస్తోంది. హారిక హాసిని సంస్థ సెకెండ్ బ్యానర్ రెడీ చేసి ఈ సినిమా కోసం ఆఫీసు కూడా తీసేసింది. సబ్జెక్ట్ నాగ చైతన్యకు, నాగార్జునకు ఓకె అయింది. అయితే ఇప్పుడు అదే నాగ చైతన్య కాల్ షీట్లను త్రివిక్రమ్ సినిమాకు వాడితే ఎలా వుంటుంది అన్న ఆలోచన చేస్తున్నట్లు వదంతులు గుప్పుమంటున్నాయి.
త్రివిక్రమ్ ఓ మీడియం రేంజ్ సినిమా చేయాలనుకుంటున్నాడు. బ్యానర్ అదే హారిక హాసిని సంస్థ. వాళ్ల దగ్గర నాగచైతన్య డేట్లు రెడీగా వున్నాయి. అందువల్ల ముందు ఆ డేట్లను త్రివిక్రమ్ సినిమాకు వాడేసి, ఆ తరువాత మళ్లీ బ్యాక్ టు బ్యాక్ మరో సినిమా చందు మొండేటితో చేస్తే ఎలా వుంటుంది అని ఆలోచిస్తున్నారన్నది వదంతుల సారాంశం.
మరి అలా అయితే చందు సినిమా ఆలస్యమవుతుందేమో? ఆ తరువాత ఆయన నిఖిల్ తో చేయాలునకున్న సినిమా కూడా ఆలస్యమవుతుందేమో?