మీడియం రేంజ్ హీరోగా ఎదిగిన రామ్ సడన్‌గా ఫ్లాపుల బారిన పడి తన రేంజ్‌ని తగ్గించేసుకున్నాడు. వరుసగా వచ్చిన మూడు ఫ్లాప్‌లు రామ్‌ని డిఫెన్స్‌లోకి నెట్టాయి. దాంతో అతని డెసిషన్ మేకింగ్‌పై ఎఫెక్ట్ పడుతోంది. ఏదైనా సినిమా అంగీకరించడానికి రామ్ మీన మేషాలు లెక్క పెడుతున్నాడు. ఇప్పటికీ అతని కోసం కథలు రాస్తున్న దర్శకులున్నా రామ్ మాత్రం చాలా జాగ్రత్త పాటిస్తున్నాడు.
రామ్ ఆచి తూచి ఎంచుకున్న ‘పండగ చేస్కో’ షూటింగ్ నిదానంగా జరుగుతోంది. ఈ చిత్రం సంక్రాంతికి వస్తుందని అనుకున్నారు కానీ మార్చిలో కానీ విడుదల కాదనేది లేటెస్ట్ న్యూస్. మసాలా తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న రామ్ ఇకపై ఎక్కువ విరామం తీసుకోనని చెబుతున్నాడు.
కొన్ని ఆసక్తికర చిత్రాలు చేయబోతున్నానని, ముందున్నవి అన్నీ మంచి రోజులే అని హోప్ ఉందని, ఇక వరుస పెట్టి సినిమాలు చేస్తానని రామ్ అభిమానులకి మాటిచ్చాడు. శ్రీనివాసరెడ్డి అనే కొత్త దర్శకుడితో రామ్ తమ సొంత బ్యానర్‌పై నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు.