ఈ నెల మూడు లేదా నాలుగో వారంలో వస్తుందనుకున్న అవును 2 సినిమా చాలా వెనక్కు వెళ్లినట్లు తెలుస్తోంది. రవిబాబు దర్శకత్వంలో సురేష్ మూవీస్ పతాకంపై దగ్గుబాటి సురేష్ నిర్మించిన సినిమా ఇది. అవును సినిమా రెండో భాగం. సినిమా మొత్తం పూర్తయిపోయింది.
అయితే ఇప్పుడు ఈ సినిమాను విడుదల చేయడానికి సరైన స్లాట్ దొరకడం లేదు. 19న విడుదల చేస్తే బాగానే వుంటుంది కానీ సురేష్ బాబు నిర్మాత మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్, థియేటర్ల లీజు దారుడు కూడా. ఇప్పుడు వరుసగా సినిమాలు వున్నాయి. లింగా , ముకుందా, అవకాశం వుంటే టెంపర్. ఆపై తన స్వంత సినిమా గోపాల గోపాల. వీటన్నింటికి థియేటర్లు చూడాలి.
ఇలాంటి టైమ్ లో ఈచిన్న సినిమా కోసం పెద్ద సినిమాల బిజినెస్ ను తన థియేటర్లకు లేకుండా చేసుకోవడం సరైనది కాదు. పైగా ఇది చాలా ప్లాన్డ్ గా బడ్జెట్ లో తీసిన సినిమా. ఆ జోనర్ కు ఎప్పుడూ దాని ఆడియన్స్ దానికి వుంటారు. అందువల్ల ఇప్పుడు కాకుండా ఫిబ్రవరిలో వేసినా ఓకె. లేదా గోపాల గోపాల తరువాత వన్ వీక్ గ్యాప్ ఇచ్చి వేసుకున్నా ఫరవాలేదు. అందుకే ప్రస్తుతానికి వాయిదా..