ఆమె ఐటెంసాంగ్ కు స్పెషల్ సెంటిమెంట్

తమన్న ఐటెంసాంగ్ చేస్తే సినిమా సూపర్ హిట్ అనే రిమార్క్ బాలీవుడ్ లో పడిపోయింది.

సెంటిమెంట్లు టాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాదు. ఆ మాటకొస్తే, బాలీవుడ్, కోలీవుడ్ లో సెంటిమెంట్లు ఇంకా ఎక్కువ. అలాంటి సెంటిమెంట్ ఒకటి తమన్నాకు అద్భుతంగా కలిసొచ్చింది.

తమన్న ఐటెంసాంగ్ చేస్తే సినిమా సూపర్ హిట్ అనే రిమార్క్ బాలీవుడ్ లో పడిపోయింది. దీనికి కారణం స్త్రీ-2 సినిమా. ఆ మూవీలో మిల్కీ బ్యూటీ చేసిన ఐటెంసాంగ్ పెద్ద హిట్. సినిమాకు అది బాగా కలిసొచ్చింది.

దీంతో చాలా సినిమాల్లో తమన్నాను స్పెషల్ సాంగ్ లో తీసుకోవాలని చూస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా రైడ్-2లో తమన్నాను తీసుకున్నారు. ఆమెపై ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారు.

కెరీర్ లో తమన్న చాలా ఐటెంసాంగ్స్ చేసింది. సరిలేరు నీకెవ్వరు, జై లవకుశ లాంటి ఎన్నో సినిమాల్లో ఆమె ప్రత్యేక గీతాల్లో కనిపించింది. కొన్ని మొహమాటానికి చేస్తే, మరికొన్ని భారీ పారితోషికం కోసం చేసింది. రైడ్-2 స్పెషల్ సాంగ్ కోసం అమె కెరీర్ బెస్ట్ రెమ్యూనరేషన్ అందుకోబోతోంది.

తెలుగులో ఆమె చేసిన ఓదెల-2 విడుదలకు సిద్ధమైంది. ఆమె గ్లామర్ ఇమేజ్ కు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉండబోతోంది.

3 Replies to “ఆమె ఐటెంసాంగ్ కు స్పెషల్ సెంటిమెంట్”

Comments are closed.