మలయాళం నుంచి వచ్చిన నటులంతా తెలుగులో ఓ మోస్తరుగా మెరిసినవాళ్లే. మోహన్ లాల్ నుంచి మొదలుపెడితే పృధ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, ఫహాద్ ఫాజిల్.. ఇలా కొంతమంది పేర్లు చెప్పుకోవచ్చు.
కానీ ఒక్కరు మాత్రం ఈ లిస్ట్ లో మిస్సయ్యారు. అతడే షైన్ టామ్ చాకో. పైన చెప్పుకున్న నటులకు ఏమాత్రం తీసిపోని టాలెంట్ ఉన్న నటుడు ఇతడు. కేరళలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. కానీ తెలుగు-తమళ భాషలకు వచ్చేసరికి తన స్థాయి పాత్రలు పోషించడంలేదు ఈ నటుడు.
దసరా, రంగబలి లాంటి సినిమాల్లో మంచి పాత్రలు పోషించిన ఈ నటుడు, ఆ తర్వాత ఫుల్ లెంగ్త్ పాత్రల్లో కనిపించడం మానేశాడు. అలా అని గ్యాప్ తీసుకోలేదు. చిన్నాచితకా పాత్రలు చేస్తూ, తన స్థాయిని తగ్గించుకుంటున్నాడు.
మొన్నటికిమొన్న డాకు మహారాజ్ వచ్చింది. అందులో ఇతగాడి పాత్ర చాలా చిన్నది. ఇక రాబిన్ హుడ్ సినిమాలో అంతకంటే దారుణమైన పాత్ర.
ఇలాంటి పాత్రలు చేస్తున్నాడేంటి అనుకునేలోపే, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో కనిపించాడు. కేవలం ఒకే ఒక్క సీన్ లో కనిపించి, అదో రకంగా నటించి వెళ్లిపోతాడు. ఇకపై తెలుగు-తమిళ్ లో చాకో, ఇలాంటి చిన్నచిన్న పాత్రలు చేయడం ఆపేస్తే మంచిదేమో.
జాయిన్ అవ్వాలి అంటే