మే 9 రిలీజ్.. మేం నమ్మం దొర

వాళ్లు చెప్పింది మళ్లీ మళ్లీ చెబుతూనే ఉన్నారు. ఇటు పుకార్లు వాటి పని అవి చేస్తూనే ఉన్నాయి.

వాళ్లు చెప్పింది మళ్లీ మళ్లీ చెబుతూనే ఉన్నారు. ఇటు పుకార్లు వాటి పని అవి చేస్తూనే ఉన్నాయి. హరిహర వీరమల్లు సినిమా మేటర్ ఇది. ఈ సినిమా పోస్ట్ పోన్ అయిందని మేకర్స్ చెప్పడం లేదు. మే 9న వస్తున్నామంటూ ప్రతిసారి చెబుతున్నారు. అదే టైమ్ లో ఈ సినిమా చెప్పిన తేదీకి రాదంటూ ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

ఇప్పుడు మరోసారి ఇదే రిపీటైంది. హరిహర వీరమల్లు నుంచి ప్రకటన వచ్చింది. రీ-రికార్డింగ్, డబ్బింగ్, విజువల్ ఎఫెక్ట్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మే 9న థియేటర్లలోకి వస్తామని ప్రకటించారు. మరోవైపు సోషల్ మీడియాలో “మేం నమ్మం దొర” అంటూ పోస్టులు పడుతున్నాయి.

మేకర్స్ ప్రకటనలో కొత్తదనం ఏమీ లేదు, వాళ్లు ఇవ్వాల్సిన అసలైన క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి ఈ సినిమాపై పుకార్లు తగ్గుతాయని అనుకోవడం అత్యాశే అవుతుంది.

ఈ సినిమాకు సంబంధించి పవన్ కల్యాణ్ చేయాల్సిన ఓ బ్లాక్ పెండింగ్ లో ఉంది. ఆ షూటింగ్ అయితే తప్ప సినిమా విడుదలపై క్లారిటీ రాదు. ఆ విషయం చెప్పకుండా ఇలా ఎన్ని ప్రకటనలు చేసినా ఉపయోగం లేదు. దానిపై మాత్రం యూనిట్ స్పష్టత ఇవ్వడం లేదు.

మేకర్స్ వరస చూస్తుంటే, కీలకమైన ఆ బ్లాక్ ను పక్కనపెట్టి సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టినట్టున్నారు. అదే కనుక జరిగితే వచ్చేనెల 9కి రావడం పెద్ద కష్టమేం కాదు.

5 Replies to “మే 9 రిలీజ్.. మేం నమ్మం దొర”

Comments are closed.