బొత్స క్లారిటీ ఇచ్చేశారా?

వైసీపీలో ఎంతో గౌరవం మర్యాద దక్కుతోంది. పార్టీకి ఆశాజనకమైన వాతావరణం ఉందని సీనియర్ అయిన బొత్సకు తెలుసు

ఉత్తరాంధ్రలో సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీద ఇటీవల కాలంలో రకరకాలైన ప్రచారాలు వస్తున్నాయి. ఆయన జనసేనలోకి వెళ్తారు అని కూటమి వైపు చూస్తున్నారు అని. అంతే కాదు ఆయన పవన్ కళ్యాణ్ తో రెండు మూడు సందర్భాలలో కలవడం సాన్నిహిత్యంగా మెలగడంతో ఈ ప్రచారానికి మరింత ఊతం లభించింది.

అలాగే మెగా ఫ్యామిలీతో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధాలు సామాజిక లెక్కలు ఇలా అన్నీ చూసుకున్న వారు కూడా బొత్స వైసీపీకి రేపో మాపో గుడ్ బై చెబుతారు అన్నట్లుగా వార్తలు రాసేశారు. బొత్సని వైసీపీని పెట్టి ఎవరికి మటుకు వారు కధనాలు ప్రచారం చేశారు.

అయితే దాని మీద మాట్లాడాల్సిన వారు బొత్స ఒక్కరే. ఆయన అయితే ఈ తరహా కధనాల మీద ఇప్పటిదాకా ఎక్కడా రియాక్ట్ కాలేదు. అయితే ఆయన తాజాగా విశాఖలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాత్రం ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఆయన ఇండైరెక్ట్ గానే ఇచ్చిన ఈ క్లారిఫికేషన్ ఈ వార్తలకు ఇకనైనా చెక్ చెప్పేలా ఉందని అంటున్నారు. ఆయన జగన్ ని అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడిగా పేర్కొన్నారు. జగన్ కి జనాదరణ అధికమని చెప్పారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు ప్రతీ అయిదేళ్ళకూ మారుతాయని అంటూ మళ్ళీ వైసీపీదే అధికారం అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు.

వైసీపీ అధినేతగా మాజీ సీఎంగా జగన్ కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, భద్రత కూటమి ప్రభుత్వం ఇవ్వకపోవడం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వైసీపీదే మళ్ళీ రోజులు అన్నట్లుగా బొత్స చాలా బలంగా చెప్పిన మాటలను చూసిన వారు ఎంతో అనుభవం ఉన్న ఆ నాయకుడు కేవలం నాలుగేళ్ళ కోసం పార్టీలు మారరని అంటున్నారు.

బొత్స ఇపుడు శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు. ఆయనకు కేబినెట్ హోదా కూడా ఉంది ఎమ్మెల్సీ పదవి కూడా మరో మూడేళ్ళకు పైగా ఉంది. వైసీపీలో ఎంతో గౌరవం మర్యాద దక్కుతోంది. పార్టీకి ఆశాజనకమైన వాతావరణం ఉందని సీనియర్ అయిన బొత్సకు తెలుసు అంటున్నారు. ఇవన్నీ చూస్తే బొత్స వైసీపీని వీడుతారు అన్న వార్తలకు ఇక ఫుల్ స్టాప్ పడాల్సిందే అని అంటున్నారు.

14 Replies to “బొత్స క్లారిటీ ఇచ్చేశారా?”

  1. మరలా గెలవదని అనిపిస్తే వెళ్లి పోవచ్చు లెండి..

    రాజకీయ నాయకులను పూర్తి గా నమ్మడానికి లేదు..

    1. Okka పది రోజుల క్రితం ఆయన అనుచరులను కలిసాను. సేన కోసం ప్రయత్నం చేసారు. కానీ కుదర లేదు ఎందుకంటే వీళ్లది ఫ్యామిలీ ప్యాక్ దాన్ని భరించే స్థితి లో లేదు జనసేన లో లాస్ట్ మినిట్ లో స్టాప్ అయ్యారు

  2. మన జగన్ రెడ్డి పార్టీ కి మిగిలిన ఏకైన నాయకుడు వీడొక్కడే..

    ఎక్కడ ఎగిరిపోతాడో అని.. ఒట్టలు చేత్తో పట్టుకుని బతుకుతున్నారు..

    వాడు మాట్లాడే ప్రతి నత్థి మాటకు.. మనకు తోచిన అర్థం తీసుకుని.. ఒట్టలు చల్లార్చుకొంటున్నారు..

    ఏమి ఖర్మ రా మీ పార్టీ కి..

    ..

    ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారుతుందంట.. ఏ రాజ్యాంగం లో రాసి ఉంది..?

    30 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న వాడు చెప్పే మాటలేనా ఇవి..

  3. సింహం వీర్యం తో పుట్టిన “సింగల్ సింహన్నే” సవాల్ చేసే దైర్యం ఈ నత్తి సత్తి గాడికి ఎక్కడ??

    భారతదేశ చరిత్ర లోనే 6% సీట్స్.. అంటే 11 సీట్లు సాధించిన సింహం ప్రజాధరణ అంటే మాటలా??

  4. Wow.. వాడొక వేణు స్వామి, నువ్వొక నిత్యానంద, మీ ఇద్దర్నీ నమ్ముకొని మళ్ళీ మా అన్న మళ్ళీ cm అవుతాడు అంటావ్…

  5. వేరే పార్టీ అధికారం లో ఉంటే..5 ఏళ్ళకొకసారి అధికారం మారుతుంది..

    అదే మన పార్టీ అధికారం లో ఉంటే ఇంకో 30 ఏళ్లు fevikol వేసుకుని కుర్చీలో కూర్చుంటాం..

    ఏం మనిషివి రా బొత్సా నువు

  6. కూటమికి అధికారం పోదు

    వైసీపీ కి మళ్ళీ అధికారం రాదు

    ఇది ఫిక్సు..బొత్స భవితన్యానికి కామ నే కానీ పులుస్టాప్ లేదే !

  7. కూటమికి అధికారం పోదు

    వై సీ పీ కి మళ్ళీ అధికారం రాదు

    ఇది ఫిక్సు..బొత్స భవితన్యానికి కామ నే కానీ పులుస్టాప్ లేదే !

Comments are closed.