బన్నీ వాస్…గీతా సంస్థకు, జిఎ 2 కు అన్నీ తానై వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడూ వ్యవహరస్తున్నారో లేదో తెలియదు. హీరో అల్లు అర్జున్ కు అయితే కుడి, ఎడమ అన్నీ బన్నీవాస్ నే. అయితే గత కొంత కాలంగా బన్నీవాస్ గీతా వ్యవహారాల విషయంలో పనులు తగ్గించుకుంటున్నట్లు కనిపిస్తోంది. కొన్నేళ్ల క్రితమే విద్య గీతా సంస్థకు సిఇఓ గా వచ్చారు. మెగాస్టార్ తోడల్లుడు, అల్లు అరవింద్ మరో బావగారు అయిన వెంకటేశ్వరరావు కుమార్తె ఆమె. బన్నీవాస్ ప్లేస్ లోకి మెల్లగా విద్య ను తీసుకువస్తారు అని అప్పుడే టాక్ మొదలైంది.
ఈ విషయంలో బన్నీ వాస్ కూడా క్లారిటీగానే వున్నారు. విద్య అన్నీ నేర్చుకుంటున్నారనే చెప్పేవారు. తను పనులు తగ్గించుకుంటున్నా అనే క్లారిటీ ఇచ్చేవారు. ఏ రోజూ ఈ విషయంలో బన్నీ వాస్ క్వశ్చన్ లను దాటవేయలేదు. తండేల్ సినిమా తరువాత బన్నీ వాస్ దాదాపు గీతా సంస్థకు దూరం అవుతారని వార్తలు వినిపిస్తూ వచ్చాయి.
ఇప్పుడు ఉన్నట్లుండి బన్నీ వాస్ పేరు వినిపించడం ఆగిపోయింది. శ్రీవిష్ణు సినిమా సింగిల్ అనేది గీతా సంస్థ నుంచి వస్తోంది. యూజువల్ గా సినిమా ప్రచారం మొదలైతే బన్నీ వాస్ కచ్చితంగా తెరమీదకు వస్తారు. కానీ ఇప్పుడు ఆయన ప్లేస్ లో విద్య వస్తున్నారు. మరి బన్నీ వాస్ ఏ విధంగా బిజీగా ఉన్నారో తెలియదు. అట్లీతో బన్నీ సినిమా ఒప్పుకున్నారు. అంతా చెన్నయ్, ముంబయ్ వ్యవహారం. నిర్మాత చెన్నయ్, దర్శకుడు ముంబయ్. అందువల్ల హీరో తరపున వ్యవహారాలు చక్కబెట్టడానికి బన్నీ వాస్ ముంబయ్, చెన్నయ్ ల నడుమ చక్కర్లు కొడుతున్నారు అనుకోవాలి.
జనసేన వ్యవహారాల్లో బన్నీ వాస్ ఎన్నికల టైమ్ లో చాలా కీలకంగా వ్యవహరించారు. అంటే కొందరికి కోపంగా ఉండొచ్చు కానీ యూజ్ అండ్ త్రో వ్యవహారంలో మెగా హీరోలు కాస్త ముందుంటారు అనే టాక్ వుంది. 2019 ఎన్నికల టైమ్ లో జనసేనలో పవన్ కళ్యాణ్ కు బన్నీ వాస్ అన్నీ తానై వ్యవహరించారు. కానీ తరువాత పవన్ ఆయనను దూరం పెట్టేసారు. సరిగ్గా 2024 దగ్గరకు వస్తుంటే ప్రచార కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించారు. మళ్లీ బన్నీ వాస్ కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఎన్నికలు అయ్యాక మళ్లీ బన్నీ వాస్ ను దూరం పెట్టేసారు.
ఇదిలా వుంటే త్రివిక్రమ్-బన్నీ సినిమాకు సంబంధించిన నిర్మాణంలో గీతా సంస్థకు కూడా భాగస్వామ్యం వుంది. ఈ వ్యవహారాలు కూడా విద్య నే చస్తున్నట్లు తెలుస్తోంది.
గీతా సంస్థ వ్యవహారాలు, జనసేన పనులు వదిలేస్తే ఇక మిగిలింది బన్నీ వాస్ స్వంత వ్యాపారాలు, బన్నీ వ్యవహారాలు మాత్రమే. మరి కొత్తగా ఏమైనా స్టార్ట్ చేస్తారా? లేదా 2029లో రాజకీయాల్లోకి వచ్చేవరకు సైలెంట్ గా అలా వుండారా అన్నది చూడాలి.
Mana sister paristiti ade Kada chesadu anna
Use and throw gurinchi nuvve matladali mari..manchi comedy sense undhi ra GA niku.
use and throw deeni kanna best example evadu vuntadu – mana 11 mohan reddy, thalli chelli, ippudu vijay sai… vaadukuni gentesadu… anna ki award ivvochu ee catrgory lo.. emanatayu mana paytm dogs? hahahaaha
విద్య నే చస్తున్నట్టు ఏంటి …. చూస్తున్నట్టు…. ఎదుటవారిని లో లోపాలు వెతకటం ఆపి ముందు మన లోపాలు సరిదిద్దుకోండి
Mega and Allu ki ela pillalu pettali anede ee article saramsam. GA, Mega heroes use and through lo mundu untara? Mari Thandel, Pushpa2 movie ticket price Andhra lo ela pencharantav ?, Andhra Cinematography minister Janasena ne kada ra…
Mega and Allu ki ela pillalu pettali anede ee saramsam. GA, Mega heroes use and through lo mundu untara? Mari Thandel, Pushpa2 movie ticket price Andhra lo ela pencharantav ?, Andhra Cinematography minister Janasena ne kada ra…
Mega and Allu ki ela pillalu pettali anede ee article saramsam.
GA, Mega heroes use and through lo mundu untara? Mari Thandel, Pushpa2 movie ticket price Andhra lo ela pencharantav ?, Andhra Cinematography minister Janasena ne kada ra…
Mega, Allu vidadeeyataniki GA oo chinna prayatnam …
9989064255