కడుపు మాడ్చుకుంటున్న హీరోలు

సినిమాల్లో మేకోవర్ కోసం, కెరీర్ ను కొనసాగించడం కోసం హీరోలు ఎంత కష్టపడతారో పైకి కనిపించదు.

సినిమాల్లో మేకోవర్ కోసం, కెరీర్ ను కొనసాగించడం కోసం హీరోలు ఎంత కష్టపడతారో పైకి కనిపించదు. కొన్ని సందర్భాల్లో వాళ్లు బయటపడినప్పుడు మాత్రమే ఆ కష్టం ఏంటనేది జనాలకు తెలిసొస్తుంది. మరీ ముఖ్యంగా ఫిజిక్ ను కాపాడుకునేందుకు వాళ్లు పడే తాపత్రయం చూస్తే నిజంగా ముచ్చటేస్తుంది.

తాజాగా నాగచైతన్య ఇచ్చిన స్టేట్ మెంట్ తో ఈ అంశంపై మరోసారి చర్చ మొదలైంది. ఇన్నేళ్లయినా నాగచైతన్య ఒకే తరహా ఫిజిక్ మెయింటైన్‌ చేస్తున్నాడు. అది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోయే వాళ్లు కూడా ఉన్నారు. ప్రతిరోజూ కఠినమైన డైట్ ఫాలో అవుతాడు నాగచైతన్య.

పొట్టలోకి వెళ్లే ప్రతిది లెక్కించి మరీ తింటాడంట. ఎంత ప్రొటీన్ తింటున్నాం, ఎన్ని కార్బొహైడ్రేట్స్ అవసరం లాంటివి కౌంట్ చేసి మరీ తింటాడట. ఈ క్రమంలో బిర్యానీ, ఐస్ క్రీమ్స్, ఫాస్ట్ ఫుడ్స్ కు పూర్తిగా దూరమయ్యానని చెప్పుకొచ్చాడు.

ఒకప్పుడు జంక్ ఫుడ్ కోసం ఇంట్లో డబ్బులు దొంగతనం చేసిన రోజులు కూడా ఉన్నాయని, అలాంటిది ఇప్పుడు అన్నింటికీ దూరమయ్యానని బాధపడుతూ చెప్పుకొచ్చాడు. ఆదివారం మాత్రం ఐస్ క్రీమ్ తింటానని, ఆ రోజు కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటానని అన్నాడు.

మహేష్ బాబు కూడా ఇంతే. పాల ఉత్పత్తులకు పూర్తిగా దూరం. ఐస్ క్రీమ్, పెరుగు, కేక్ లాంటివి తిని కొన్నేళ్లయిందని స్వయంగా ప్రకటించాడు. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం సరదాగా ఐస్ క్రీమ్ లేదా కేక్ తింటానని గతంలో ఓ సందర్భంలో వెల్లడించాడు.

ప్రభాస్-ఎన్టీఆర్ కూడా అంతే. ఈ ఇద్దరు హీరోలు తరచుగా వెయిట్ ఇష్యూస్ తో బాధపడుతుంటారు. ఒక్కోసారి బరువు పెరుగుతారు, అంతలోనే స్లిమ్ గా మారిపోతారు. మొన్నటి వరకు కాస్త హెవీ వెయిట్ లో కనిపించిన ఈ హీరోలిద్దరూ ప్రస్తుతం సన్నగా మారారు.

రీసెంట్ గా ఎన్టీఆర్ స్లిమ్ లుక్ ఫొటోలపై ఎంత చర్చ జరిగిందో అందరికీ తెలిసిందే. ఫిజిక్ ను కాపాడుకునేందుకు వీళ్లు కూడా కఠినమైన ఆహార నియమాలు పాటిస్తుంటారు. ప్రభాస్ అయితే తన టీమ్ లో కీలక సభ్యులందరికీ మంచి భోజనం పెడతాడు. తనే దగ్గరుండి వడ్డిస్తాడు. కానీ అతడు మాత్రం ఓ చిన్న కప్పులో ఓట్స్ లేదా ఆకులు లాంటివి తింటుంటాడు. ఇది ఎంత కష్టమో ఆ స్థానంలో ఉండేవాడికే అర్థమౌతుంది.

రీసెంట్ గా శర్వానంద్ కూడా ఇలానే తయారయ్యాడు. అమాంతం బరువు తగ్గాడు. ఎక్కువగా వ్యాయామాలు చేయడంతో పాటు, స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నాడు. ఫుడ్ విషయంలో శర్వానంద్ అంత కఠినంగా ఉండడం ఎవ్వరితరం కాదంటూ రామ్ చరణ్ లాంటి హీరో కితాబిచ్చాడంటే, శర్వా ఎంత కష్టపడ్డాడో అర్థం చేసుకోవచ్చు.

అటు చరణ్, నాని లాంటి హీరోలు కూడా తమ సినిమాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు డైట్ ప్లాన్స్ మారుస్తుంటాడు. ‘ది ప్యారడైజ్’ కోసం నాని, పెద్ది కోసం చరణ్ కాస్త బరువు పెరుగుతున్న సంగతి తెలిసిందే.

21 Replies to “కడుపు మాడ్చుకుంటున్న హీరోలు”

  1. బరువు పెరిగితే తగ్గేదే లేదు.

    అనుష్క సైజ్ జీరో తర్వాత ఏమయింది? అది ఆమె చేసిన పెద్ద మిస్టేక్. ఇంతవరకూ కోలుకోలేదు. ఇంకా కాదు

  2. నా సంవత్సరం సంపాదన వాళ్ల ఒక నిముషం సంపాదన కన్నా తక్కువే ఉండచ్చు. కడుపు నిండా బిరియాని తింటా, ఐస్ క్రీమ్స్ స్వీట్స్ లెక్క పెట్టుకోను. పోతే పోతా, సంపాదించుకున్నది తిని పోతా 🤣🤣🤣

Comments are closed.