పవన్ చిన్న కొడుకు హెల్త్ అప్ డేట్

మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడు.

సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. హుటాహుటిన అతడ్ని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అలా 2 రోజుల పాటు హాస్పిటల్ లో ఉన్న బాలుడు, ఈరోజు డిశ్చార్జ్ అయ్యాడు.

“మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడు. మా దైవం హనుమంతుడే ఓ పెద్ద ప్రమాదం నుంచి, విషాధం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు.”

ఇలా బాబు హెల్త్ అప్ డేట్ అందించారు చిరంజీవి. మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. ప్రస్తుతం బాబుకు ఇంటివద్ద నుంచే చికిత్స అందిస్తున్నారు. బాబుకు బ్రాంకోస్కోపీ నిర్వహించినట్టు 2 రోజుల కిందట పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

సమ్మర్ క్యాంప్ కోసం కొడుకును తీసుకొని సింగపూర్ వెళ్లారు పవన్ భార్య. ఆ స్కూల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఓ చిన్నారు మృతి చెందింది. స్వల్ప గాయాలతో మార్క్ శంకర్ బయటపడ్డాడు. అయితే ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో చికిత్స అందిస్తున్నారు.

4 Replies to “పవన్ చిన్న కొడుకు హెల్త్ అప్ డేట్”

Comments are closed.