చిత్రం: గుడ్ బ్యాడ్ అగ్లీ
రేటింగ్: 2.25/5
తారాగణం: అజిత్, త్రిష, అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, ప్రియా వారియర్, సిమ్రాన్ తదితరులు
కెమెరా: అభినందన్ రామానుజం
ఎడిటింగ్: విజయ్ వేలుకుట్టి
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాత: నవీన్ యేర్నేని, రవిశంకర్ వై.
దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్
విడుదల తేదీ: 10 ఏప్రిల్ 2025
అజిత్ సినిమా వస్తుందంటే తమిళనాట పెద్ద పండగ. తెలుగులో కూడా నిన్నమొన్నటి వరకు ఈ హీరో సినిమాలకు కాస్త గట్టిగానే ప్రచారం చేసి వదిలేవారు. కానీ ఈసారి మాత్రం పెద్దగా ప్రచారం చేయకుండానే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ పేరిట అజిత్ సినిమాను రిలీజ్ చేశారు. తెలుగు నిర్మాతలు తీసిన ఈ తమిళ డబ్బింగ్ సినిమాలో గుడ్ ఎంత, బ్యాడ్ ఎంత, అగ్లీ పార్ట్ ఎంతనేది చూద్దాం.
ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్ (అజిత్) తన గ్యాంగ్ స్టార్ జీవితాన్ని వదిలేసి కుటుంబంతో సంతోషంగా ఉండాలనుకుంటాడు. అందుకే జైలుకు వెళ్తాడు. కొడుకు కోసం ఏడాది ముందే అతడు జైలు నుంచి బయటకొస్తాడు. అంతలోనే కొడుకు కిడ్నాప్ అవ్వడంతో పాటు డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటాడు. బయటకొచ్చిన రెడ్ డ్రాగన్, కొడుకును ఎలా కాపాడుకున్నాడు? రెడ్ డ్రాగన్ కు జానీ (అర్జున్ దాస్), బేబుల్ (జాకీష్రాఫ్)కు సంబంధం ఏంటి? అసలు తన భార్య రమ్య (త్రిష)కు రెడ్ డ్రాగన్ ఇచ్చిన మాటేంటి?
సింపుల్ కథ ఇది. తన కొడుకును హీరో ఎలా కాపాడుకున్నాడనేదే లైన్. ఓపెనింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ఇదే లైన్ లో సినిమా నడుస్తుంది. దీన్నే అజిత్ అభిమానులకు నచ్చేలా తీశాడు దర్శకుడు అధిక్. ఒక్క ముక్కలో చెప్పాలంటే అజిత్ ఫ్యాన్స్ కు ఇదొక సెలబ్రేషన్ మూవీ. తెలుగులో అతడికి అభిమానులుంటే ఈ సినిమా నచ్చుతుంది. మీరు అజిత్ అభిమాని కాకపోతే కాస్త ఓపిగ్గా చూడాల్సి ఉంటుంది.
సాధారణంగా గ్యాంగ్ స్టర్ డ్రామాలన్నీ హీరో యాక్షన్ తో మొదలై, చివరికి అతడు మారిపోయి జైలుకెళ్లడంతో ముగుస్తాయి. కానీ ఈ సినిమా మాత్రం హీరో మారిపోయి జైలుకెళ్లడంతో మొదలవుతుంది. కొడుకు కోసం ఏడాది ముందే జైలు నుంచి ఏకే బయటకొచ్చిన తర్వాత అసలు సమస్యలు మొదలవుతాయి. కొడుకు కిడ్నాప్ అవుతాడు. ఆ తర్వాత డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటాడు.
ఇలా చేస్తోంది ఎవరో తెలుసుకోవడం కోసం తన నెట్ వర్క్ మొత్తాన్ని బయటకు తీస్తాడు ఏకే. కానీ అతడెవరనేది కనుక్కోలేకపోతాడు. కనిపించకుండా ఏకేతో ఆడుకుంటున్నది ఎవరో తెలిసేసరికి ఇంటర్వెల్ వస్తుంది. సెకండ్ పార్ట్ లో విలన్లను హీరో ఎలా చేరుకున్నాడు తన కొడుకును ఎలా కాపాడుకున్నాడో చూపించారు.
కేవలం ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని తీసిన ఈ సినిమాలో ప్రారంభం నుంచి అజిత్ ఎలివేషన్స్ వరుసగా వస్తూనే ఉంటాయి. కరడుగట్టిన గ్యాంగ్ స్టర్, తన కుటుంబంతో శేష జీవితాన్ని గడపడం కోసం అన్ని పనులు మానేసి జైలుకెళ్లడం నుంచి కథ మొదలవుతుంది. అక్కడ్నుంచి ఒక్కో లెవెల్ లో కథను రివీల్ చేస్తూనే, సమాంతరంగా ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్ ఎవరు, అతడెంత శక్తిమంతుడు అనే విషయాల్ని బ్లాక్స్ గా చూపించడం బాగుంది. ఈ క్రమంలో జాన్ విక్ లాంటి ఇంటర్నేషనల్ గ్యాంగ్ స్టర్ పాత్రల్ని కూడా వాడేశాడు దర్శకుడు.
పేరుకు ఇది గ్యాంగ్ స్టర్ డ్రామానే అయినప్పటికీ ఎక్కడా ఆ సీరియస్ నెస్ చూపించలేదు. ఒకవేళ కథ లేదా సన్నివేశం సీరియస్ మలుపు తీసుకుంటోందని మీకు అనిపించేలోపే అక్కడొక వింటేజ్ సాంగ్ పెట్టాడు దర్శకుడు. ఇంకొన్నిచోట్ల కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. మరికొన్ని చోట్ల వింటేజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వినిపించడంతో పాటు, అలనాటి అజిత్ హీరోయిన్ ను కూడా పరిచయం చేశాడు. ఇలా సినిమా ఆసాంతం, అజిత్ కెరీర్ మొత్తాన్ని సెలబ్రేట్ చేసుకునేలా, హీరోకు అనుకూలంగా, అతడి ఫ్యాన్స్ కు వినోదం పంచేలా సాగిపోతుంది.
మూవీ మొత్తం అజిత్ వన్ మేన్ షో కనిపించింది. తుపాకీ పట్టినా, కత్తి దూసినా, కారు డ్రైవ్ చేసినా, బైక్ పై స్టంట్ చేసినా.. ఎక్కడా తన మార్క్ మిస్సవ్వలేదు అజిత్. కొన్నిచోట్ల సాల్ట్-పెప్పర్ లుక్ లో, మరికొన్ని చోట్ల స్మార్ట్ లుక్ లో వేరియేషన్స్ చూపించి మెప్పించాడు. ఈ క్రమంలో గ్రాఫిక్స్ ను గట్టిగా వాడినప్పటికీ, అవన్నీ ఫ్యాన్స్ కు వినోదం అందించడం కోసమనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈసారి అజిత్ రిస్కీ ఫైట్స్ చేయలేదు. కాకపోతే అతడు భారీ ఫైట్స్ చేసినట్టు కెమెరా టెక్నిక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కవర్ చేసి భలేగా మేజిక్ చేశాడు దర్శకుడు. మూవీ మొత్తం అజిత్ శ్వాగ్ కనిపిస్తుంది.
హీరోయిన్ విషయానికొస్తే, గ్లామర్ పరంంగా, నటనా పరంగా త్రిష ఆకట్టుకుంది. సినిమాలో కేవలం హీరోయిన్ గా కాకుండా మంచి పాత్ర పోషించింది. అయితే మూవీలో 18 ఏళ్ల కొడుక్కి తల్లిగా త్రిషను చూపించడాన్ని ఆమె అభిమానులు ఎలా స్వాగతిస్తారో చూడాలి. సునీల్, ప్రభు, ప్రసన్న తమ పాత్రలకు న్యాయం చేశారు. హీరోయిన్ ను కాపాడుతూ, హీరోకు హెల్ప్ చేసే క్యారెక్టర్లు అవి. సినిమా మొత్తంలో సర్ ప్రైజింగ్ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది అర్జున్ దాస్ పాత్ర. అదేంటనేది ఇక్కడ రివీల్ చేయడం కరెక్ట్ కాదు. మూవీలో ఎక్స్ పీరియన్స్ చేయాల్సిందే. ప్రత్యేక పాత్రలు పోషించిన ప్రియా వారియర్, సిమ్రాన్ ఆకట్టుకున్నారు.
దర్శకుడు అధిక్ రవించంద్రన్ ఈ సినిమా కోసం కాస్త అధికంగానే ఎలివేషన్స్ రాసుకున్నాడు. సినిమా కథ సగమైతే, ఎలివేషన్లు మరో సగం ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే హీరో కనిపించిన ప్రతి చోట ఓ ఎలివేషన్ లేదా అతడి వింటేజ్ సాంగ్ వస్తుంది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు పూర్తిగా అజిత్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని, అతడి వింటేజ్ లుక్స్, పాత హిట్ సాంగ్స్ తో నింపేసిన మూవీ ఇది.
హీరో తర్వాత ఈ సినిమా కోసం అంతలా కష్టపడిన వ్యక్తి జీవీ ప్రకాష్ కుమార్. సినిమాలో ఎక్కడా జీవీకి గ్యాప్ ఇవ్వలేదు. ప్రారంభం నుంచి చివరివరకు మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నింపేశారు. మధ్యలో వచ్చిన వింటేజ్ సాంగ్స్ పాటలు అదనం. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కథకు తగ్గట్టున్నాయి. ‘మైత్రీ’ నిర్మాతలు ఎప్పట్లానే ఖర్చుకు వెనకాడకుండా చాలా గ్రాండ్ గా సినిమాను నిర్మించారు. ఒక దశలో నిర్మాతలు కూడా అజిత్ వీరాభిమానులేమో అనిపిస్తుంది.
ఓవరాల్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా మరీ బ్యాడ్ కాదు, అలా అని వెరీ గుడ్ అనలేం. అజిత్ అభిమానులు ఈ సినిమాను ఎన్నిసార్లయినా చూడొచ్చు. సామాన్య ప్రేక్షకులు ఓసారి ట్రై చేయొచ్చు.
బాటమ్ లైన్ – కొంచెం గుడ్.. కొంచెం బ్యాడ్.. నో అగ్లీ
సూపర్
కనీసం కామెంట్స్ కూడా లేవు
జాయిన్ కావాలి అంటే
ఇచ్చిన రివ్యూ కి రాసిన మేటర్ క కి సంబంధమే లేదు
హాయ్
ఐతే థియేటర్లో చూడాల్సిన అవసరం లేదు
nv chudakule
Overall this movie is very good movie. Hero Azit action is super and the good direction of Adhik Ravichandran may seen in this movie.
The Best movie and the action of Super star Azith so much impressive and Ravichandran is a good director.
movie super