కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధుల‌పై స‌ర్వే… సంచ‌ల‌నం!

కేవ‌లం 30 శాతం మాత్ర‌మే పాజిటివిటీ ఉన్న 71 మంది ఎమ్మెల్యేల వివ‌రాలు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి ఎమ్మెల్యేల‌పై ఒక ప్ర‌ముఖ స‌ర్వే సంస్థ ఐఐటీ నిపుణుల‌తో రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్వే చేయించింది. స‌ర్వేలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూశాయి. కేవ‌లం ప‌ది నెల‌ల పాల‌న పూర్తి చేసుకుంటున్న కూట‌మిలోని ప్ర‌జాప్ర‌తినిధుల‌పై ఏకంగా 70 శాతం వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల సంఖ్య‌… అక్ష‌రాలా 71. ఈ నివేదిక కూట‌మి గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించేలా వుంది.

మ‌ద్యం, ల్యాండ్, రియ‌ల్ ఎస్టేట్ మాఫియాలుగా ప్ర‌జాప్ర‌తినిధులు త‌యార‌య్యారు. స‌ర్వేలో భాగంగా వెలుగు చూసిన సంచ‌ల‌న విష‌యాలు ఇలా ఉన్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు నేరుగా రియ‌ల్ ఎస్టేట్‌, ల్యాండ్ మాఫీయా అవ‌తారం ఎత్తారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో వివిధ సంస్థ‌లు, వ్య‌క్తుల నుంచి భారీ మొత్తంలో లంచం రూపంలో డ‌బ్బు గుంజుతున్నారు. మైనింగ్ మాఫియా, కాంట్రాక్ట‌ర్ల నుంచి ముక్కు పిండి మ‌రీ వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్నారు.

అలాగే చిన్న‌చిన్న వ్యాపార‌స్తులు, ప్ర‌భుత్వ ఉద్యోగుల నుంచి కూడా డ‌బ్బు దోస్తున్నారు. కొంత మంది ప్ర‌జాప్ర‌తినిధులు కేడ‌ర్‌కు అందుబాటులో వుండ‌డం లేదు. అలాగే ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని గాలికి వ‌దిలేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి 164 అసెంబ్లీ సీట్ల‌ను గెలుచుకుని అప‌రిమిత‌మైన అధికారాన్ని ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప‌ది నెల‌ల్లోనే సీన్ రివ‌ర్స్ అవుతోంది.కేవ‌లం 30 శాతం మాత్ర‌మే పాజిటివిటీ ఉన్న 71 మంది ఎమ్మెల్యేల వివ‌రాలు… ఉమ్మ‌డి జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి.

శ్రీ‌కాకుళం జిల్లాలో శ్రీ‌కాకుళం, ఎచ్చెర్ల‌, పాల‌కొండ (ఎస్టీ), ప‌లాస‌, పాత‌ప‌ట్నం; విజ‌య‌న‌గ‌రం జిల్లాలో గ‌జ‌ప‌తిన‌గ‌రం, నెల్లిమ‌ర్ల‌, సాలూరు (ఎస్టీ), పార్వ‌తీపురం (ఎస్సీ), కురుపాం (ఎస్టీ); విశాఖ‌ప‌ట్నం జిల్లాలో య‌ల‌మంచిలి, పెందుర్తి , విశాఖ‌ప‌ట్నం (సౌత్‌), న‌ర్సీప‌ట్నం, అన‌కాప‌ల్లి; ఈస్ట్ గోదావ‌రి జిల్లాలో తుని, రాజాన‌గ‌రం, పి.గ‌న్న‌వ‌రం (ఎస్సీ), కాకినాడ రూర‌ల్ , రంప‌చోడ‌వ‌రం (ఎస్టీ), రాజోలు (ఎస్సీ), కొత్త‌పేట‌, రామ‌చంద్రాపురం;

వెస్ట్ గోదావ‌రి జిల్లాలో తాడేప‌ల్లిగూడెం, న‌ర‌సాపురం, ఉంగ‌టూరు, నిడ‌ద‌వోలు, పోల‌వ‌రం (ఎస్టీ), చింత‌ల‌పూడి (ఎస్సీ); కృష్ణా జిల్లాలో విజ‌య‌వాడ వెస్ట్‌, తిరువూరు (ఎస్సీ), కైక‌లూరు, నూజివీడు, నందిగామ (ఎస్సీ); గుంటూరు జిల్లాలో పెద‌కూర‌పాడు, న‌ర్సారావుపేట‌, గుంటూరు వెస్ట్ , తెనాలి, బాప‌ట్ల‌, గుర‌జాల‌;

ప్ర‌కాశం జిల్లాలో కందుకూరు, మార్కాపురం, చీరాల‌, గిద్ద‌లూరు; నెల్లూరు జిల్లాలో కావ‌లి, స‌ర్వేప‌ల్లి, సూళ్లూరుపేట (ఎస్సీ), ఉద‌య‌గిరి; వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలో క‌డ‌ప‌, రాయ‌చోటి, కోడూరు (ఎస్సీ); క‌ర్నూలు జిల్లాలో ప‌త్తికొండ‌, ఆళ్ల‌గ‌డ్డ‌, పాణ్యం, ఆదోని, క‌ర్నూలు, డోన్‌, నందికొట్కూరు (ఎస్సీ);

అనంత‌పురం జిల్లాలో మ‌డ‌క‌సిర (ఎస్సీ), పెనుగొండ‌, క‌దిరి, గుంత‌క‌ల్‌, అనంత‌పురం అర్బ‌న్‌, సింగ‌న‌మ‌ల (ఎస్సీ), క‌ల్యాణ‌దుర్గం; చిత్తూరు జిల్లాలో శ్రీ‌కాళ‌హ‌స్తి, తిరుప‌తి, చంద్ర‌గిరి, న‌గరి, గంగాధ‌ర‌నెల్లూరు (ఎస్సీ), స‌త్య‌వేడు (ఎస్సీ) నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధులు 70 శాతం ప్ర‌జావ్య‌తిరేక‌త క‌లిగి ఉండ‌డం కూట‌మికి షాక్ తెప్పించేలా వుంది.

అలాగ‌ని మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల‌పై ప్ర‌జాద‌ర‌ణ ఉంద‌ని అర్థం కాద‌ని ఆ స‌ర్వే సంస్థ నిర్వాహ‌కులు చెబుతున్నారు. 30-40 శాతం మ‌ధ్య ప్ర‌జాద‌ర‌ణ ఉండి, 60 నుంచి 70 శాతం లోపు వ్య‌తిరేక‌త క‌లిగిన ప్ర‌జాప్ర‌తినిధులు కూడా చాలా మంది ఉన్న‌ట్టు తెలిపారు. ఏది ఏమైనా ఈ స‌ర్వే నివేదిక‌ను కూట‌మి సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం వుంది. కాదు, కూడ‌ద‌ని కొట్టి పారేస్తే, దారుణ ఓట‌మికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని ప‌రిగ‌ణించాల్సి వుంటుంది.

22 Replies to “కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధుల‌పై స‌ర్వే… సంచ‌ల‌నం!”

      1. వాళ్ళు ఇంకా డిబేట్స్ లో పాల్గొంటున్నారు కదా..

        ఆరా మస్తాన్ వైసీపీ గెలిచి తీరుతుందని సర్వే చేసి మాయమైపోయాడు..

    1. సిద్ధం సభలకు టీవీ లో వొచ్చిన trp బట్టి సీట్స్ ఎన్ని వొస్తాయో కూడా చెప్పాడు ..

  1. అంత వ్యతిరేకత ఉంటె మ్మెల్సీ ఎన్నికలో మనం ఎందుకు పోటీ నుంచి తప్పు కున్నాం .. వాళ్ళు ఎందుకు గెలిచారు .. ఇలా భ్రమలో ఉంటె ఇప్పుడు ఉన్న గోచి కూడా ఉండదు ..

  2. చెవిరెడ్డి గాడి సంస్థ నా కొంపతీసి?అందుకే నెమో అన్నీయ్య 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి ఇక ఆ తరువాత తెరిసినా ఎం కనపడదు అంటున్నాడు పదే పదే:)

Comments are closed.