గట్టిగా కాదు, కొత్తగా ట్రై చేస్తున్నాడు

మంచి పాత్రలు దొరికితేనే నటిస్తానని ప్రకటించిన ఈ సీనియర్ నటి, పూరి జగన్నాధ్ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా, బలంగా ఉంటుందని చెబుతోంది.

‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ లాంటి సినిమాలతో సక్సెస్ కోసం గట్టిగా ట్రై చేశాడు పూరి జగన్నాధ్. కానీ ఆ సినిమాలు వర్కవుట్ అవ్వలేదు. దీంతో ఇప్పుడీ దర్శకుడు కొత్తగా ట్రై చేయాలని ఫిక్స్ అయ్యాడు.

డిఫరెంట్ స్టోరీ రాసుకొని, విజయ్ సేతుపతిని ఒప్పించాడు. సినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా. ఇప్పుడీ డిఫరెంట్ కథలోకి ఫిమేల్ లీడ్ గా టబును తీసుకున్నారు. ఈ విషయాన్ని ఈరోజు ఎనౌన్స్ చేశారు.

‘అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత తెలుగులో టబు అంగీకరించిన సినిమా ఇది. అంటే, దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత టాలీవుడ్ లో ఆమె తిరిగి నటిస్తోందన్నమాట.

మంచి పాత్రలు దొరికితేనే నటిస్తానని ప్రకటించిన ఈ సీనియర్ నటి, పూరి జగన్నాధ్ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా, బలంగా ఉంటుందని చెబుతోంది.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో మొదలవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇతర నటీనటులతో పాటు, మ్యూజిక్ డైరక్టర్ ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తారు.

4 Replies to “గట్టిగా కాదు, కొత్తగా ట్రై చేస్తున్నాడు”

Comments are closed.