ధనుష్.. కమ్ముల.. మళ్లీ మరోసారి

ధనుష్ వరుసగా తెలుగు సినిమాలు చేస్తున్నారు. సర్ తరువాత కుబేర చేసారు. మళ్లీ సర్ నిర్మాతకే మరో సినిమా ఓకె అన్నారు.

కుబేర. ఈ సినిమా మీద మంచి బజ్ వుంది. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల చేస్తున్న ఆసియన్ మూవీస్ సినిమా. ఈ సినిమా విడుదల ఇంకా కాస్త దూరంలో వుండగానే ఇదే కాంబినేషన్ లో మరో సినిమా చేయాలని డిసైడ్ అయిపోయారు నిర్మాత ఆసియన్ సునీల్. ఈ మేరకు నిన్నటికి నిన్న ముగ్గురు సమావేశమై ఓకె అనుకున్నారు.

ధనుష్ వరుసగా తెలుగు సినిమాలు చేస్తున్నారు. సర్ తరువాత కుబేర చేసారు. మళ్లీ సర్ నిర్మాతకే మరో సినిమా ఓకె అన్నారు. ఇప్పుడు కుబేర నిర్మాతకే మళ్లీ మరో సినిమా ఓకె చేసారు. అంటే మొత్తం నాలుగు తెలుగు సినిమాలు.

కుబేర సినిమాలో ధనుష్ తో పాటు నాగార్జున, రష్మిక తదితర భారీ తారాగణం వుంది. శేఖర్ కమ్ముల స్టయిల్ లో చాలా కాలం షూటింగ్ జరుపుకున్న సినిమా ఇది. మనిషి మీద, మనిషి వ్యవహారశైలి మీద, జీవన శైలి మీద డబ్బు ప్రభావం ఎలా వుంటుంది అనే బేసిక్ పాయింట్ నుంచి తయారైన థ్రిల్లర్ సినిమా ఇది అని తెలుస్తోంది. ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ పని చేసారు.

ఆసియన్ సినిమాస్ లవ్ స్టోరీ సినిమాను శేఖర కమ్ములతో తీసారు. మళ్లీ కుబేర తీసారు. ఇప్పుడు మరో సినిమా ఓకె చేసారు. ఆ విధంగా అది హ్యాట్రిక్ కాంబినేషన్ అవుతోంది.

2 Replies to “ధనుష్.. కమ్ముల.. మళ్లీ మరోసారి”

Comments are closed.