లోకేశ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు.. నిజ‌మెంతో?

ఆదాయ వ‌న‌రుల్ని లోకేశ్‌కు స‌మీక‌రించడానికి బ‌ల‌మైన నెట్‌వ‌ర్క్ ప‌ని చేస్తోంద‌నే విమ‌ర్శ టీడీపీ వ‌ర్గాల నుంచే వ‌స్తోంది.

టీడీపీలోనూ, కూట‌మి ప్ర‌భుత్వంలోనూ పేరుకు సీఎం చంద్ర‌బాబునాయుడిది పెద్ద‌రికం. కానీ పెత్త‌నం అంతా బాబు త‌న‌యుడు, మంత్రి నారా లోకేశ్‌దే. ఇది జ‌గ‌మెరిగిన స‌త్యం. టీడీపీ భ‌విష్య‌త్ ర‌థ‌సార‌థి ఆయ‌నే కావ‌డంతో స‌హ‌జంగానే, లోకేశ్ జోక్యం ఎక్కువ‌గా వుంటోంది. రాజ‌కీయాల్లో మంచి జ‌రిగితే అంతా లోకేశ్ గొప్ప అంటారు. లేదంటే రాళ్లు వేయించుకోడానికి సిద్ధంగా వుండాలి.

కూట‌మి పాల‌న ప‌ది నెల‌లు పూర్తి వ‌చ్చింది. మ‌రో రెండు రోజుల్లో 11వ నెల‌లో అడుగు పెట్ట‌బోతోంది. అయితే అనూహ్యంగా కూట‌మి పాల‌న‌పై నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. మీడియా బ‌లంతో ఇంకా వైఎస్ జ‌గ‌న్ దుర్మార్గ పాల‌న అంటూ ప్ర‌చారం చేస్తున్నారు. కానీ ప్ర‌జ‌ల‌పై ఆ ప్ర‌చారం ప‌ని చేయ‌డం లేదు. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్నోళ్లు ఏమీ చేయ‌డం లేద‌నే ఆవేద‌న‌, ఆగ్ర‌హం ప్ర‌జానీకంలో వుంది.

మ‌రీ ముఖ్యంగా టీడీపీలో సీనియ‌ర్ నేత‌ల‌ను దాదాపు ప‌క్క‌న పెట్టేశారు. లోకేశ్ టీమ్ అధికారాన్ని చెలాయిస్తోంది. పోనీ, వాళ్లేమైనా కాస్త ప‌లుకుబ‌డి, పెద్ద‌రికం ఉన్నోళ్లా? అంటే… అంత సీన్ లేద‌నే స‌మాధానం వ‌స్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు తిరుప‌తి జిల్లానే తీసుకుందాం. శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి హ‌వా కొన‌సాగిస్తున్నారు. ఆయ‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌పై ఎలాంటి చ‌ర్య‌లు లేవు.

ఆఫ్ ది రికార్డ్‌గా బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి త‌న సంపాద‌న‌లో లోకేశ్‌కు కొంత ఇస్తున్న‌ట్టు చెబుతున్నార‌ని స‌మాచారం. అందుకే సుధీర్‌పై ఈగ వాల‌నివ్వ‌కుండా లోకేశ్ అడ్డుకుంటున్నార‌ని ఆ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులే చెబుతున్నారు. అలాగే లోకేశ్ చుట్టూ ఉన్న టీమ్ స‌భ్యుల్ని గ‌మ‌నిస్తే, లాబీయిస్టుల‌కు పెద్ద‌పీట‌. లాబీయిస్టులంటే ఏం చేస్తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఆదాయ వ‌న‌రుల్ని లోకేశ్‌కు స‌మీక‌రించడానికి బ‌ల‌మైన నెట్‌వ‌ర్క్ ప‌ని చేస్తోంద‌నే విమ‌ర్శ టీడీపీ వ‌ర్గాల నుంచే వ‌స్తోంది. డ‌బ్బులిస్తే, ఈ ప్ర‌భుత్వంలో ఏ ప‌నైనా జ‌రుగుతుంద‌నే మాట టీడీపీ నాయ‌కుల నుంచే వ‌స్తోంది. “పార్టీ కోసం ఎంత క‌ష్ట‌ప‌డితే ఏం లాభం. యువ నాయ‌కుడికి ముట్ట‌చెప్ప‌డానికి మా ద‌గ్గ‌ర ఏమీ లేదు. ఫ‌లానా కార్పొరేష‌న్ ప‌ద‌వికి ఇన్ని కోట్లు అడుగుతున్నారు” అని టీడీపీ నాయ‌కులు వాపోతున్నారు. రాజ‌కీయాల్లో ప్ర‌చారం జ‌రుగుతున్నంత‌గా అవినీతి లేక‌పోవ‌చ్చు. కానీ నిప్పులేనిదే పొగ రాద‌నే నానుడిని కొట్టి పారేయ‌లేని ప‌రిస్థితి.

ప్ర‌ధానంగా టీడీపీ కేడ‌ర్‌లో తీవ్ర అసంతృప్తి రావ‌డానికి, గ‌తంలో మాదిరి ప‌నిచేసే వాళ్ల‌కు ప‌ద‌వులు ద‌క్క‌క‌పోవ‌డ‌మే అని సీనియ‌ర్ నేత‌లు అంటున్నారు. డ‌బ్బుకు లోకం దాసోహం అనే మాట‌లో లోకం అనే ప‌దానికి బ‌దులు త‌మ నాయ‌కుడి పేరు మార్చుకుంటే స‌రిపోతుంద‌నే టీడీపీ నాయ‌కుల ఆవేద‌న‌, ఆగ్ర‌హంలో నిజ‌మెంతో ఆ ప‌రమాత్ముడికే తెలియాలి. కానీ క్షేత్ర‌స్థాయిలో ఇలాంటి అబిప్రాయం, విమ‌ర్శ‌ల్ని టీడీపీ అధిష్టానం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం వుంది.

26 Replies to “లోకేశ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు.. నిజ‌మెంతో?”

      1. చిలక జోస్యం కి secundrabad రైల్వే స్టేషన్ దగ్గర మంచి డిమాండ్…అక్కడ చెబితే చిల్లర వేస్తారు

          1. Paytm బ్యాచ్ హక్కు అది…జూన్ 4 2024 పోరంబోకు బ్యాచ్ అంత అక్కడే…నీకు సీట్ రిజర్వ్ వెళ్లు

          2. తెలుసుకోవాలిగా…నీలాంటి ఎదవ సన్నాసి నీ గుర్తుపట్టి, చిల్లర వెయ్యాలి

  1. అవును వాళ్ళేం పెద్ద మనుషులు. పెద్ద మనుషులు అంటే – కోడలి, వంశి, దువ్వాడ, అనంత బాబు, గోరంట్ల, రోజా, జోగి, అంబటి

Comments are closed.