నేను మోదీ భక్తురాలిని.. రేణూ దేశాయ్

ఒకవేళ రేణూ దేశాయ్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉండొచ్చు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్ రేణూ దేశాయ్ రాజకీయాల గురించి మాట్లాడింది. అలా ఇలా మాట్లాడటం కాదు. ఒక ఇంటర్వ్యూలో ఆమె రాజకీయాలపై ఆసక్తిని కనబరిచింది. తనకు బీజేపీ అంటే ఇష్టమని చెప్పింది. ‘నేను నరేంద్ర మోదీ భక్తురాలిని. ఎప్పటికీ ఆయన్నే సపోర్ట్ చేస్తా’ అని చెప్పింది. తనకు రాజకీయాల్లో చేరాలనే కోరిక ఉందని కూడా చెప్పింది.

గతంలోనే తనకు రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం వచ్చిందని, కాని అప్పుడు పిల్లలు చిన్నవాళ్లు కావడంతో ఆ ఆలోచన మానుకున్నానని చెప్పింది రేణూ దేశాయ్. తాను రాజకీయాల్లోకి వెళతానని తన జాతకంలోనే ఉందని చెప్పింది. ఎవరేం అనుకున్నా తాను ఎప్పటికీ మోదీనే సపోర్ట్ చేస్తానని అన్నది. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించిందని, కాబట్టి తాను ఎప్పటికీ సనాతనురాలిననే చెప్పుకుంటానని అన్నది.

ఒకవేళ రేణూ దేశాయ్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉండొచ్చు. అయితే ఒకసారి తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పింది. కాని ఇప్పుడు మాత్రం రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తోంది. గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి మాధవీలత పోటీ చేసిన సంగతి తెలిసిందే.

ఆమెకు రేణూ దేశాయ్ సపోర్ట్ చేసింది. ఆమె ‘స్ట్రాంగ్ ఉమన్’ అని ప్రశంసించింది. సనాతన ధర్మ పరిరక్షకుడినని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ అల్రెడీ బీజేపీకి బలమైన మద్దతుదారుగా ఉన్నాడు. మరి పవన్ ప్రభావం రేణూ దేశాయ్ పడిందేమో చెప్పలేం.

8 Replies to “నేను మోదీ భక్తురాలిని.. రేణూ దేశాయ్”

Comments are closed.