మైత్రీ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “జాట్”. ఈ సినిమా ఈ నెల 11న విడుదల కాబోతోంది. పది రోజుల క్రితం వచ్చిన ట్రైలర్ చూసినా, అంతకు ముందు వచ్చిన టీజర్ చూసినా, తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన వీర మాస్ జానర్ ను మరింత పదును పెట్టి వదులుతున్నట్లు కనిపిస్తోంది. ట్రైలర్ లో కావచ్చు, టీజర్ లో కావచ్చు. మనం చూసిన టైపు సీన్లు, మనకు పరిచయం ఉన్న వీర మాస్ జానర్ నే కనిపిస్తుంది. కానీ ఇది హిందీ జనాలకు కాస్త కొత్తగా ఉండొచ్చు.
ఇటీవల ఈ టైపు హెవీ రఫ్ యాక్షన్ సినిమాలను బీహార్ బెల్ట్ లో బాగా ఆదరిస్తున్నారు. దాన్నే దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేస్తూ ఉండొచ్చు. సన్నీడియోల్ ఇప్పుడు ఫామ్ లోకి వచ్చారు. ఈ జానర్.. సన్నీ కాంబినేషన్ క్లిక్ అయితే, దర్శకుడు గోపీచంద్ మలినేని పాన్ ఇండియా డైరెక్టర్ గా ఫిక్స్ అయిపోతారు.
ఇదిలా ఉంటే, ఈ సినిమా నిర్మాత, దర్శకుడు తెలుగు వాళ్లు కనుక, మనకు కూడా నప్పే జానర్ కనుక తెలుగులో విడుదల అవుతుంది అని అనుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు కాస్త ఆలస్యంగా తెలుగులో విడుదల చేస్తారని తెలుస్తోంది. డబ్బింగ్ పనులు పూర్తి కాకపోవడం వల్ల తెలుగులో హిందీతో సమానంగా విడుదల చేయడం లేదని తెలుస్తోంది. వీలైనంత వరకు వర్క్‌లు పూర్తి చేయడానికి ట్రై చేస్తున్నారు. లేదంటే తెలుగు వెర్షన్ విడుదల ఉండదు.
dubbing panulu late kaadu, Hindi lo hit aithe ikkada vadulutaru anthe
జాయిన్ కావాలి అంటే
Hi.friends