కొలిక‌పూడికి అవ‌మానం!

టీడీపీలో కొలిక‌పూడికి రాజ‌కీయంగా నూక‌లు చెల్లాయ‌నే మాట వినిపిస్తోంది.

ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ల‌లో ఇవాళ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా హెలిప్యాడ్‌లో బాబుకు స్వాగ‌తం ప‌ల‌క‌డానికి విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని, ఇత‌ర చిన్నాపెద్దా టీడీపీ నాయ‌కులు క్యూ క‌ట్టారు. ఒక్క కొలిక‌పూడిని మిన‌హాయిస్తే, మిగిలిన ప్ర‌తి ఒక్క‌ర్నీ చంద్ర‌బాబు ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. వాళ్లు చెప్పింది బాబు విన్నారు. అలాగే వాళ్ల‌తో బాబు ఏదో చెప్పారు.

కానీ త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన కొలిక‌పూడి ముఖం వైపు చూడ‌డానికి కూడా చంద్ర‌బాబు ఏ మాత్రం ఆస‌క్తి చూప‌క‌పోవ‌డం వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపించింది. బాబుతో క‌ర‌చాల‌నం చేసి, ప‌ల‌కరిద్దామ‌న్న కొలిక‌పూడి ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌లేదు. ఇక చేయ‌గ‌లిదేమీ లేక … నెమ్మ‌దిగా కొలిక‌పూడి వెన‌క్కి నెట్ట‌బ‌డ్డారు. ఈ ప‌రిణామం కొలిక‌పూడి వ్య‌తిరేకుల‌కు అమితానందం క‌లిగిస్తోంది.

మ‌రోవైపు ఇవాళ ద‌ళిత జాతీయ నాయ‌కుడు బాబు జ‌గ్జీవ‌న్‌రామ్ జ‌యంతి. ఈ రోజే ద‌ళిత ఎమ్మెల్యే అయిన కొలిక‌పూడికి చంద్ర‌బాబు చేతిలో అవ‌మానం జ‌రిగింద‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. అస‌లు కొలిక‌పూడిపై క‌న్నెత్తి కూడా చూడ‌డానికి చంద్ర‌బాబు ఇష్ట‌ప‌డ‌లేదంటే, ఆ పార్టీలో ద‌ళిత ఎమ్మెల్యే ప‌రిస్థితి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఇలాగైతే టీడీపీలో కొలిక‌పూడి సాంకేతికంగా ఉండ‌డం త‌ప్పితే, ఆయ‌న‌కు ఎలాంటి ప‌వ‌ర్ లేద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

టీడీపీలో కొలిక‌పూడికి రాజ‌కీయంగా నూక‌లు చెల్లాయ‌నే మాట వినిపిస్తోంది. త‌న‌ను బాబు అవ‌మానించ‌డంపై కొలిక‌పూడి ఎలా స్పందిస్తారో మ‌రి!

17 Replies to “కొలిక‌పూడికి అవ‌మానం!”

  1. ja*** గాడికి జరిగిన అవమానాలు తో పోల్చుకుంటే ఇదొక లెక్క!! సిగ్గు విడిచి తుడిచేసుకుని వాడు తిరగటంలే అంతే!!

  2. Orey GA, Karanam balaram, Sidda ala chala mandi ni bayapetti ycheap loki lagaru…ivala valla future ento teledu. Veedu mee part lo join ayite vunna kasta paruvu kuda potundi

  3. GA, Karanam balaram, Sidda ala chala mandi ni bayapetti ycheap loki lagaru…ivala valla future ento teledu. Veedu mee part lo join ayite vunna kasta paruvu kuda potundi

Comments are closed.