గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ మారు మనసు పొందారు. గతంలో చెప్పిన దానికి భిన్నంగా ఇప్పుడు మాట్లాడారు. దేన్ని గురించి మాట్లాడారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి. ఒకప్పుడు కేసీఆర్ ఏమన్నారు? కాంగ్రెసు పార్టీ అధికారంలోకొచ్చిన తొలి రోజుల్లోనే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, ఆరు నెలల్లో లేదా ఏడాదిలో కూలిపోతుందని అన్నారు. ఆయన మాత్రమే కాదు. కేటీఆర్, హరీష్రావు కూడా అలాగే మాట్లాడారు. ఈ ప్రభుత్వం కూలిపోతే వచ్చేది తమ ప్రభుత్వమేనని అన్నారు.
చాలామంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని కేసీఆర్ స్వయంగా చెప్పారు. వారు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. కాని ఏడాదిన్నర గడిచిపోయినా ఏమీ కాలేదు. పైగా బీఆర్ఎస్ నుంచే పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెసు పార్టీలో చేరారు. వారి అనర్హతకు సంబంధించి వాదోపవాదాలు పూర్తయి సుప్రీం కోర్టులో తీర్పు రిజర్వులో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నారు? ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి రావడం తమకు ఇష్టం లేదంటున్నారు.
మరో మూడేళ్ల వరకు అంటే అయిదేళ్ల గడువు పూర్తయ్యే వరకు కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలో ఉంటుందని అన్నారు. తాము ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి దర్జాగా అధికారంలోకి వస్తామని చెప్పారు. ప్రభుత్వాన్ని కూల్చి తాను సీఎం సీట్లో కూర్చోవడాన్ని ఆయన ఎవరో వేసిన భిక్షగా అభివర్ణించారు. ‘వాడూ వీడూ భిక్ష వేస్తే నేను సీఎం సీట్లో కూర్చోను’ అన్నారు. కాంగ్రెసు ఎమ్మెల్యేలు తన దగ్గరకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అడిగినా తాను మాత్రం దానికి ఒప్పుకోనని అన్నారు.
మధ్యలో అధికారాన్ని తీసుకోబోమని, అసెంబ్లీ ఎన్నికల్లోనే తేల్చకుంటామని చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటే ప్రజలు తప్పులు తెలుసుకొని మళ్లీ బీఆర్ఎస్ను గెలిపిస్తారని కేసీఆర్ అభిప్రాయం కావొచ్చు. ఇక కాంగ్రెసు పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయనే గట్టి నమ్మకంతో కేసీఆర్ ఉన్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని, దాంతో కాంగ్రెసు పార్టీ పరువు పోతుందని, మళ్లీ బీఆర్ఎస్ ఇమేజ్ పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. కాబట్టి కేసీఆర్ చెబుతున్నట్లు రేవంత్ ప్రభుత్వం అయిదేళ్లు పూర్తి చేసుకుంటుందా? మధ్యలోనే కూలిపోతుందా? అనేది కాలమే చెప్పాలి.
మారు మనస్సు, యవ్వన కూడిక, యవ్వన రాత్రి, మోకాళ్ళ ప్రార్థన
అనేది వాటికన్ గొర్రె బిడ్డలు ము అని చెప్పుకుంటి దశమ భాగాల వసూళ్లు చేసే వాళ్ళు వాడే భాష.
గ్రేట్ ఆంద్ర లో కూడా అదే ముఠా వాళ్ళు ఉన్నట్లు ఉన్నారు. అదే భాష వాడుతున్నారు.
వీర హిందూ కేసీఆర్ ఎప్పుడు మతం మారాడా అని అనుకున్నాం , చప్పున ..హెడ్డింగ్ చూసి.
దేవుడి తో ఓ రాత్రి.. రాత్రి కూడికలు.. యేసు తైల మరదనం..
జాయిన్ అవ్వాలి అంటే
Next మనమే కానీ, నువ్వు సీటు ఎక్కాలంటే ముసలోడికి టికెట్ ఇవ్వాలిరా రకుల్ రావు
మారిన మనిషి
appudu oka full vesaadu le
గట్టిగా మూడేళ్ల పాటు కళ్ళు మూసుకొండి వచ్చేది మన ప్రభుత్వమే అంటున్న అన్నయ్య