నాగ‌బాబుపై బుస‌కొడుతున్న టీడీపీ!

కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎమ్మెల్సీ, జ‌న‌సేన రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కొణిదెల నాగ‌బాబుపై టీడీపీ బుస కొడుతోంది.

కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎమ్మెల్సీ, జ‌న‌సేన రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కొణిదెల నాగ‌బాబుపై టీడీపీ బుస కొడుతోంది. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో వ‌రుస‌గా రెండో రోజు నాగ‌బాబు ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. వీటికి టీడీపీ ఇన్‌చార్జ్ వ‌ర్మ‌కు ఆహ్వానం అంద‌క‌పోవ‌డంపై టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు తీవ్రంగా ర‌గిలిపోతున్నారు. అన్న క్యాంటీన్ ప్రారంభానికి వెళ్లిన నాగ‌బాబుకు గురువారం టీడీపీ కార్య‌క‌ర్త‌ల నుంచి చేదు అనుభ‌వం ఎదురైన సంగ‌తి తెలిసిందే.

ఇవాళ మ‌రోసారి నాగ‌బాబు ప‌ర్య‌ట‌న‌లో ఉద్రిక్త‌త నెల‌కుంది. నియోజ‌క‌వ‌ర్గంలోని కుమార‌పురంలో సీసీరోడ్ల ప్రారంభానికి నాగ‌బాబు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. ప‌ర‌స్ప‌రం దూషించుకున్నారు. జ‌న‌సేన శ్రేణులు జై జ‌న‌సేన‌, జైజై ప‌వ‌న్‌క‌ల్యాణ్ అని నిన‌దిస్తూ టీడీపీ శ్రేణుల్ని రెచ్చ‌గొట్టారు. దీంతో తామేం త‌క్కువ కాదంటూ టీడీపీ శ్రేణులు కూడా దీటుగా కౌంట‌ర్ ఇచ్చాయి.

జై టీడీపీ, జైజై వ‌ర్మ అని నినాదాలు ఇచ్చారు. అంతేకాదు, నాగ‌బాబుకు వ్య‌తిరేకంగా టీడీపీ కార్య‌క‌ర్త‌లు నినాదాలు ఇవ్వ‌డంతో తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కుంది. ఇరుపార్టీల వాళ్ల‌కు స‌ర్ది చెప్ప‌డానికి పోలీసుల‌కు క‌ష్ట‌మైంది.

పిఠాపురంలో వ‌ర్మ‌ను అవ‌మానించ‌డానికే నాగ‌బాబు వ‌చ్చారంటూ టీడీపీ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. త‌మ అండ‌తో గెలుపొంది, ఇప్పుడు అవ‌మానిస్తారా? అని టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు నిల‌దీస్తున్నారు. ఇలాగైతే రానున్న రోజుల్లో త‌గిన గుణ‌పాఠం చెబుతామ‌ని వాళ్లు హెచ్చ‌రించారు.

12 Replies to “నాగ‌బాబుపై బుస‌కొడుతున్న టీడీపీ!”

    1. కూల్, వెళ్లి paytm డబ్బులు కలెక్ట్ చేసుకో ఇక్కడ నువ్వు ఎక్కిస్తే , ఓ ఊగి పోయేవాళ్ళు ఎవరు లేరు.

    2. ఇదే గొర్రె వేరే ఆర్టికల్ లో ,30 years lo పవన్ కల్యాణ్ ఒంటరిగా గెలవలేదు అని కామెంట్ పెట్టాడు, చూసుకోవాలిగా గొర్రె

Comments are closed.