బహు నాయకత్వంతో తమ్ముళ్ళ పరేశాన్

ముందు నాయకులలో ఐక్యత సాధిస్తే ఆ తరువాత పార్టీ గాడిలో పడుతుంది అని అంటున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం. అక్కడ నుంచే ఎంతో మంది జాతీయ నేతలు దేశానికి కీలక సందేశాలు ఇచ్చారు. దేశాన్ని ఏలిన వారు ఏలబోయే వారికి అనకాపల్లి అసలైన రాజకీయ వేదిక. అనకాపల్లిలో ఇపుడు తెలుగుదేశం పార్టీ చైతన్యం మరింతగా వెల్లి విరుస్తోంది అని అంటున్నారు.

ఆ పార్టీకి బహు నాయకత్వాలు ఉన్నాయని ఏ నాయకుడిని కలవాలి ఎవరి మాట వినాలని ధర్మ సందేహాలను తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లిలో మాజీ ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు. ఆయనకు నామినేటెడ్ పదవి దక్కింది దాంతో ఆయన కీలకంగా మారి చక్రం తిప్పుతున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే కూడా తన హవా చాటుకుంటున్నారు అని అంటున్నారు.

అలాగే మరో మాజీ మంత్రి ఆయన పరివారం ఆయనకు ఉంది. వీరే కాకుండా ఇంకా కీలక నేతలు బోలెడు మంది ఉన్నారు. ఎవరిది వారిదే వర్గంగా ఉందని అంటున్నారు. దాంతో పార్టీలో ఏక మాట లేకుండా పోతోందని అంటున్నారు. ఒకరి దగ్గరకు వెళ్తే ఫలానా వారి దగ్గరకు ఎందుకు వెళ్ళావని అడుగుతున్నారని ఆవేదన చెందుతున్నారు.

ముందు నాయకులలో ఐక్యత సాధిస్తే ఆ తరువాత పార్టీ గాడిలో పడుతుంది అని అంటున్నారు. ఇక్కడ టీడీపీ పరిస్థితి ఇలా ఉంటే జనసేన ఎమ్మెల్యే గెలిచారు. అయినా సరే తమదే పెత్తనం అని కొంతమంది టీడీపీ నేతలు దూకుడు చేస్తున్నారు అని జనసేన నుండి కూడా ఫిర్యాదులు ఉన్నాయట. దీని మీద హై కమాండ్ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలని అంటున్నారు.

3 Replies to “బహు నాయకత్వంతో తమ్ముళ్ళ పరేశాన్”

  1. మన జగనన్న ని నమ్ముకున్న గొర్రెలకు ఈ బాధలేమీ లేవు.. హ్యాపీ..

    ఎందుకంటే.. ఆ పార్టీ లో నాయకులే లేరు.. జగన్ రెడ్డి ని నమ్మే జనాలు కూడా లేరు.. ఇంకా హ్యాపీ..

  2. Tdp కి నలుగురు ఉంటే అది పరేషాన్ అదే ycp లో ఎవరూ లేకుంటే అది వ్యూహం, బొంగు, బోషణం

Comments are closed.