వైసీపీ మండ‌ల క‌న్వీన‌ర్‌పై హ‌త్యాయ‌త్నం.. విష‌మం!

నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలోని సిరివెళ్ల మండ‌ల వైసీపీ క‌న్వీన‌ర్ ఇందూరి ప్ర‌తాప్‌రెడ్డిని ప్ర‌త్య‌ర్థులు న‌రికారు.

నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలోని సిరివెళ్ల మండ‌ల వైసీపీ క‌న్వీన‌ర్ ఇందూరి ప్ర‌తాప్‌రెడ్డిని ప్ర‌త్య‌ర్థులు న‌రికారు. అత‌ని ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో వైసీపీ కార్య‌క‌ర్త లింగ‌మ‌య్య హ‌త్యను మ‌రిచిపోక‌నే, తాజాగా ఆ పార్టీ మండ‌ల నాయ‌కుడి ఉసురు తీయాల‌నే ప్ర‌య‌త్నం రాజ‌కీయంగా తీవ్ర వివాదమ‌వుతోంది.

సిరివెళ్ల మండ‌లంలోని గోవింద‌ప‌ల్లె నివాసి ఇందూరి ప్ర‌తాప్‌రెడ్డి. ఈయ‌న వైసీపీలో చురుగ్గా ప‌ని చేస్తున్నారు. దీంతో ప్ర‌త్య‌ర్థులు జీర్ణించుకోలేక‌పోయారు. స్వ‌గ్రామంలో ఒకే చోట ఉన్న ఆంజ‌నేయ‌స్వామి, శివాల‌యానికి ఆయ‌న వెళ్లారు. అప్ప‌టికే అక్క‌డ మాటు వేసిన ప్ర‌త్య‌ర్థులు…ప్ర‌తాప్‌రెడ్డిపై ఒక్క‌సారిగా వేట‌కొడ‌వ‌ళ్ల‌తో దాడికి పాల్ప‌డ్డారు. చ‌నిపోయార‌ని భావించిన ప్ర‌త్య‌ర్థులు, అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు.

అయితే ప్రాణాల‌తో కొట్టుమిట్టాడుతున్న ప్ర‌తాప్‌రెడ్డిని అనుచ‌రులు వెంట‌నే నంద్యాల‌లోని ప్రైవేట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. స్థానికుల నుంచి అందుతున్న స‌మాచారం మేర‌కు వివ‌రాలిలా ఉన్నాయి.

టీడీపీ అధికారంలో ఉండ‌గా 2018లో సిరివెళ్ల ఎంపీపీ ఇందూరి ప్ర‌భాక‌ర్‌రెడ్డి హ‌త్య‌కు గుర‌య్యారు. హ‌తుడు ప్ర‌తాప్‌రెడ్డికి స్వయాన అన్న అవుతాడు. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ కీల‌క ద‌శ‌కు వ‌చ్చింది. ఈ కేసులో ప్ర‌తాప్‌రెడ్డి కీల‌క సాక్షి. దీంతో ప్ర‌తాప్‌రెడ్డిని అంత‌మొందిస్తే, కేసు నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చ‌ని ప్ర‌త్య‌ర్థులు భావించిన‌ట్టు తెలిసింది. అందుకే దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డిన‌ట్టు స్థానికులు చెబుతున్నారు.

తాజాగా ప్ర‌తాప్‌రెడ్డిపై హ‌త్యాయ‌త్నం, అలాగే ఆయ‌న అన్న‌ను హ‌త్య చేసిన కేసులో ప్ర‌ధాన నిందితులు… గ‌తంలో టీడీపీ నాయ‌కుడు ఏవీ సుబ్బారెడ్డి సైకిల్ యాత్ర చేస్తుండ‌గా, దాడికి పాల్ప‌డ్డారు. ఆళ్ల‌గ‌డ్డ కీల‌క టీడీపీ లీడ‌ర్ అండ‌దండ‌ల‌తోనే ప్రాణాలు తీస్తున్నార‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. స‌ద‌రు ప్ర‌ధాన నిందితుడిపై ఇప్ప‌టికే నాలుగు కేసులున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌భుత్వం ఇలాంటి హంత‌కుల్ని క‌ఠినంగా శిక్షించాల్సిన అవ‌స‌రం వుంది.

2 Replies to “వైసీపీ మండ‌ల క‌న్వీన‌ర్‌పై హ‌త్యాయ‌త్నం.. విష‌మం!”

  1. వై*ఎస్ రాజ*శేఖర్, వివే*కా హంతకుల నీ

    తాడేపల్లి ప్యాలెస్ లో నుండి బయటకి లాక్కొచ్చి గోచి మీద తిప్పుతూ శిక్షించాలి Ys ఫాన్స్.

Comments are closed.