పెద్ద హీరోలతో సినిమాలు తీయాలంటే కేవలం భారీగా రెమ్యూనిరేషన్ ఇస్తే సరిపోదు. వారికి లాభాల్లో వాటా కూడా ఇవ్వాల్సిందే. బయటకు లాభాల్లో వాటా లెక్కన చేసాము అని కలర్ ఇస్తారు. కానీ తీసుకోవాల్సినంత రెమ్యూనిరేషన్ తీసుకుంటూనే, లాభంలో సగం వాటా తీసుకుంటారు. ఇందుకోసం ఎవరి బ్యానర్లు వారికి వున్నాయి.. పైగా పెట్టుబడి పెట్టకుండా లాభం తీసుకుంటారు. ఏమైనా అంటే తమ పేరు చూపించే కదా సినిమాకు ఫైనాన్స్ తీసుకుంటున్నారు. స్వంత పెట్టుబడి ఏమీ పెట్టడం లేదు కదా అనే లాజిక్ తీస్తారు.
ఇది ఒకప్పుడు ఒకరిద్దరు హీరోలకు మాత్రమే వుండేది. తరువాత అందరూ అదే దారి పడుతున్నారు. ఒకప్పుడు మహేష్ బాబు సినిమాలకు అన్నదమ్ముడు అప్పచెల్లళ్ల పేర్లు జోడించేవారు. అయితే అప్పుడు లాభాల్లో వాటా కాదు. జస్ట్ నామినల్ అమౌంట్ వారికి అందించేవారు. తరువాత ఆ పద్దతిని వదిలేశారు.
అల్లు అర్జున్ కూడా కొన్నాళ్లు ఇదే పద్దతి పాటించారు. మేనమామలకు, నాగబాబుకు ఈ విధంగా కొంత సాయం చేసారు. కానీ అలవైకుంఠపురములో సినిమాకు గీతాబ్యానర్ జోడించి, రెమ్యూనిరేషన్ తో పాటు లాభాల్లో సగం వాటా తీసుకున్నారు. పుష్ప 2 సినిమాకు టోటల్ బిజినెస్ లో 27.5 శాతం వాటా తీసుకున్నారని, ఇక రెమ్యూనిరేషన్ తీసుకోలేదని వార్తలు ఉన్నాయి. ఇప్పుడు అట్లీ తో చేయబోయే సినిమా విషయంలో మాత్రం అలా చేయడం లేదు. కానీ త్రివిక్రమ్ తో చేసే సినిమాకు మాత్రం మళ్లీ గీతా బ్యానర్ యాడ్ చేసి, సగం లాభాలు ఆ సంస్థకు వెళ్లేలా చేస్తారని తెలుస్తోంది.
సిద్దు జొన్నలగడ్డ తన జాక్ సినిమాకు రెమ్యూనిరేషన్ కొద్దిగా తీసుకుని, నైజాం హక్కులు కూడా తీసుకున్నారు. నిజానికి ఇలాంటి పద్దతి బెటర్.. నిర్మాతకు మేలు కూడా.
మెగాస్టార్ తొలిసారిగా తన కుమార్తె బ్యానర్ ను తన సినిమాకు జోడించబోతున్నారు. మెగాస్టార్ 75 కోట్లు, కుమార్తె బ్యానర్ కు లాభాల్లో సగం వాటా లెక్కన అనిల్ రావిపూడి సినిమా చేయబోతున్నారు.
ఎన్టీఆర్ గత కొంత కాలంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ను జోడిస్తున్నారు. రెమ్యూనిరేషన్ తో పాటు లాభాల్లో వాటా అదనంగా తీసుకుంటున్నారు. త్వరలో చేయబోయే నీల్సన్ సినిమాకు ఇదే పద్దతి వుంటుందని తెలుస్తోంది. ఈ పద్దతికి అంగీకరించకనే గతంలో త్రివిక్రమ్-హారిక హాసిని సినిమా క్యాన్సిల్ అయిందని టాక్ వుంది.
ప్రభాస్ కు, రామ్ చరణ్ కు ఈ వాటాలు వ్యవహారాలు కిట్టవు. నేరుగా రెమ్యూనిరేషన్ తీసుకోవడమే.
హీరోల సంగతి ఇలా వుంటే, దర్శకుడు రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ వీళ్లంతా కూడా లాభాల్లో వాటా తీసుకుంటారు, రెమ్యూనిరేషన్ తో పాటు. సుకుమార్ కు, త్రివిక్రమ్ స్వంత బ్యానర్ లు వున్నాయి.
హీరోయిన్లలో తొలిసారిగా ఈ పద్దతి పాటిస్తున్నారు సంయుక్త మీనన్. తాను చేసే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు తన బ్యానర్ యాడ్ చేసి కొంత రెమ్యూనిరేషన్, కొంత లాభాల్లో వాటా తీసుకుంటున్నారు.
జాయిన్ కావాలి అంటే
ఒహ్హ్
How much.
How much.
Entha.
mana anna aithe suit case companeys petti, niramathke pado parako vata isthadu !!!
that is anna !!!