మరికొన్ని రోజుల్లో రాబోతున్న అల్లు అర్జున్ పుట్టినరోజు కోసం అతడి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, ఆ రోజున బన్నీ కొత్త సినిమా ప్రకటన ఉంది. పుష్ప-2 లాంటి ఆలిండియా హిట్ తర్వాత బన్నీ చేయబోయే ప్రాజెక్టు ఇది.
అయితే అదే రోజు బన్నీతో పాటు మరో హీరో కూడా తన కొత్త సినిమాను ప్రకటించబోతున్నాడు. అతడే అఖిల్ అక్కినేని. చాన్నాళ్లుగా లైమ్ లైట్ కు దూరంగా ఉన్నాడు అఖిల్. ఏజెంట్ ఫ్లాప్ అతడ్ని కుంగదీసింది.
ఆ సినిమాపై చాలా అంటే చాలా ఆశలు పెట్టుకున్న అఖిల్, అది ఫ్లాప్ అవ్వడంతో తట్టుకోలేకపోయాడు. అందుకే ఇప్పటివరకు మరో సినిమా టేకప్ చేయలేదు. ఎట్టకేలకు ఆ బాధ నుంచి బయటపడి ఇప్పుడు కొత్త సినిమా ప్రకటించబోతున్నాడు.
వినరో భాగ్యము విష్ణుకథ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రకటననే ఓ వీడియో రూపంలో 8వ తేదీన విడుదల చేయబోతున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సినిమాతో తొలిసారి అన్నపూర్ణ స్టుడియోస్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ చేతులు కలుపుతున్నాయి. రూరల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు 8న తెలుస్తాయి.
ఓపెన్ ప్రొఫైల్
fanniemae lo fradu chesina telugollu
జాయిన్ కావాలి అంటే
హాయ్