నిద్రలేచింది మహిళా లోకం అనేది పాత పాట. రెచ్చిపోతోంది మహిళా లోకం అని ఇప్పుడు కొత్తగా పాడుకోవాల్సిన సందర్భం. మొన్నటికిమొన్న భర్తను మర్డర్ చేసి, ముక్కలు చేసి డ్రమ్ లో కుక్కింది ఓ భార్యామణి. అంతకంటే ముందు మరో నారీమణి, తన భర్తను ముక్కలు చేసి, ప్యాక్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టింది.
రోజురోజుకు భార్యలేంటి ఇలా తయారవుతున్నారని అనుకునేలోపే, మినిమం గ్యాప్ లో మరో 2 ఘటనలు జరిగాయి. ఈ రెండూ కర్నాటక రాష్ట్రంలోనే జరగడం విశేషం. ఒక ఘటనలో ప్రేమ పేరిట అబ్బాయిల్ని మోసం చేసి, ఏకంగా 4 పెళ్లిళ్లు చేసుకుంది ఓ అమ్మాయి. మరో ఘటనలో ప్రియుడి కోసం ఏకంగా కట్టుకున్న భర్తను జైలుకు పంపించింది మహా ఇల్లాలు.
కర్నాటకలోని మాండ్య జిల్లాలో ప్రేమ-పెళ్లి పేరుతో ఓ యువతి ఏకంగా నలుగుర్ని పెళ్లి చేసుకొని మోసం చేసింది. చూడ్డానికి అందంగా, సంప్రదాయబద్దంగా కనిపిస్తోంది, తియ్యగా మాట్లాడుతోంది. ఇంకేముంది శశికాంత్ పడిపోయాడు. వైష్ణవిని తన అర్థాంగిగా చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.
పెళ్లికి సరిగ్గా ఒక రోజు ముందు అర్జెంట్ అంటూ శశికాంత్ నుంచి 7 లక్షలు నగదు, 100 గ్రాముల బంగారం తీసుకొని ఉడాయించింది వైష్ణవి. పోలీసులు కూపీ లాగగా, ఆమె ఇదివరకే ఇలా ముగ్గురు అబ్బాయిల్ని పెళ్లి చేసుకొని మోసం చేసిన విషయం బయటపడింది.
ఇక ఇదే రాష్ట్రంలోని కొడుగు జిల్లాలోని బసవనహళ్లి గ్రామానికి చెందిన మల్లిగే అనే మహా ఇల్లాలది మరో కథ. 20 ఏళ్ల కిందటే ఈమెకు పెళ్లయింది. 18 ఏళ్ల కొడుకు, 15 ఏళ్ల కూతురు ఉన్నాడు. ఉన్నట్టుండి ఆమె కనిపించకుండా పోయింది. అదే టైమ్ లో నది ఒడ్డున ఓ మృతదేహం కనిపించింది.
అది మల్లిగే మృతదేహమని పోలీసులు ఫిక్స్ అయిపోయారు. ఆమె భర్తను తీసుకెళ్లి జైళ్లో పెట్టారు. విచారణ పేరిట రెండేళ్లు జైళ్లోనే ఉన్న భర్త, బెయిల్ పై బయటకొచ్చాడు. కట్ చేస్తే, ఓ రోజు రెస్టారెంట్ లో తన భార్యను చూశాడు. సీక్రెట్ గా ఫొటోలు, వీడియోలు తీసి అన్నీ జడ్జి ముందు పెట్టాడు. దీంతో మల్లిగేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్తను జైలుకు పంపించి, ప్రియుడితో కలిసి ఉండేందుకు నాటకం ఆడానని అంగీకరించింది మల్లిగే.
వామ్మో
జాయిన్ అవ్వాలి అంటే
జాయిన్ అవ్వాలి అంటే