జ‌గ‌న్ రాజ‌కీయ‌ గంజాయి వ‌నంలో తుల‌సి మొక్క‌!

వైసీపీని బ‌లోపేతం చేయ‌డానికి స‌తీష్‌రెడ్డే స‌రైన నాయ‌కుడిగా జ‌గ‌న్ గుర్తించ‌డం, ఆయ‌న్నే ముందుకు పెట్ట‌డంపై ఆ జిల్లాలోని నాయ‌కులు సంతోషిస్తున్నారు.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇష్ట‌మైన వ్య‌క్తుల జాబితాను చూస్తే… ఒక‌రిద్ద‌రు మిన‌హాయిస్తే అంతా పార్టీకి ఎ విధంగా ఉప‌యోగ‌ప‌డ‌ని వారే ఉన్నార‌ని అని వైసీపీ నేత‌లు ఆవేద‌న చెందుతుంటారు. వాళ్లైతే వంగివంగి దండాలు పెడ‌తార‌నో, తిట్టినా తిట్టించుకుంటార‌నో, కొట్టినా కొట్టించుకుంటార‌నో …కార‌ణాలు తెలియ‌దు కానీ వైసీపీకి రాజ‌కీయంగా ప‌నికొచ్చే వాళ్లు క‌నిపించ‌రు. అందుకే ఆ పార్టీ దారుణంగా ప‌త‌నమైంద‌నే అభిప్రాయం లేక‌ల‌పోలేదు.

ఈ నేప‌థ్యంలో స‌రైన వాళ్ల‌ను పెట్టుకోక‌పోతే, రానున్న రోజుల్లో రాజ‌కీయంగా తిరిగి పూర్వ వైభ‌వానికి చేరుకోలేమ‌నే భ‌యం జ‌గ‌న్‌ను వెంటాడుతున్న‌ట్టుంది. పులివెందుల‌లో సుదీర్ఘ‌కాలం పాటు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన ఎస్వీ స‌తీష్‌రెడ్డిని వైసీపీలో చేర్చుకోవ‌డం జ‌గ‌న్ చేసిన మంచి ప‌ని. త‌న‌పై జ‌గ‌న్ పెట్టుకున్న న‌మ్మ‌కానికి మించి, స‌తీష్‌రెడ్డి వైసీపీని బ‌లోపేతం చేయ‌డానికి దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో కొన్ని విష‌యాల్లో క్షేత్ర‌స్థాయిలో వాస్త‌వాల్ని తెలుసుకోడానికి నివేదిక తెప్పించే బాధ్య‌త‌ల్ని కూడా స‌తీష్‌రెడ్డికి అప్ప‌గిస్తున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఉదాహ‌ర‌ణ‌కు హిందూపురం వైసీపీ నాయ‌కుడు న‌వీన్ నిశ్చ‌ల్‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని సీనియ‌ర్ నాయ‌కుడు జ‌గ‌న్‌కు సూచించార‌ని తెలిసింది. అయితే అనంత‌పురం జిల్లాలో కొంద‌రు నాయ‌కుల‌కు న‌మ్మి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే, సొంత వాళ్ల కోసం, నిజ‌మైన జ‌గ‌న్ అభిమానుల్ని ఎలా బ‌య‌టికి పంపుతున్నారో జ‌గ‌న్‌కు మ‌రో వ‌ర్గం వివ‌రించింది.

దీంతో నిజానిజాల్ని నిగ్గు తేల్చుకునేందుకు స‌తీష్‌రెడ్డికి జ‌గ‌న్ బాధ్య‌త అప్ప‌గించారు. క్షేత్ర‌స్థాయిలో స‌తీష్‌రెడ్డి లోతుగా విచారించి, జ‌గ‌న్‌కు నివేదిక ఇచ్చారు. వాస్త‌వాలు తెలుసుకున్న జ‌గ‌న్‌… పార్టీ నుంచి న‌వీన్ నిశ్చ‌ల్‌ను బ‌య‌టికి పంపాల‌న్న నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు. ఇలా అనంత‌పురం జిల్లాలో వైసీపీని బ‌లోపేతం చేయ‌డానికి స‌తీష్‌రెడ్డే స‌రైన నాయ‌కుడ‌ని జ‌గ‌న్ గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నారు.

ఈ క్ర‌మంలో రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో హ‌త్య‌కు గురైన లింగ‌మ‌య్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డానికి జ‌గ‌న్ వెళ్ల‌నున్నారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల బాధ్య‌త‌ను స‌తీష్‌రెడ్డికే అప్ప‌గించ‌డం విశేషం. స‌తీష్‌రెడ్డికి వైసీపీ, జ‌గ‌న్ ప్ర‌యోజ‌నాలు త‌ప్ప‌, వ్య‌క్తిగ‌త స్వార్థం లేద‌ని గ్ర‌హించడం వ‌ల్లే ఆయ‌న‌కు అనంత‌పురం బాధ్య‌త‌ల్ని అప్ప‌గించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇంత‌కాలం కొంద‌రు పెద్ద నాయ‌కులు త‌మ‌కు ప‌నికొచ్చే వాళ్ల‌ను అందలం ఎక్కించ‌డం, గిట్ట‌ని వాళ్ల‌ని అణ‌గ‌దొక్క‌డం చేస్తూ వ‌చ్చారు. అందుకే అనంత‌పురం జిల్లాలో వైసీపీ బ‌ల‌హీన‌ప‌డింది.

అక్క‌డ వైసీపీని బ‌లోపేతం చేయ‌డానికి స‌తీష్‌రెడ్డే స‌రైన నాయ‌కుడిగా జ‌గ‌న్ గుర్తించ‌డం, ఆయ‌న్నే ముందుకు పెట్ట‌డంపై ఆ జిల్లాలోని నాయ‌కులు సంతోషిస్తున్నారు. స‌తీష్‌రెడ్డిని అధికారికంగా అనంత‌పురం జిల్లా బాధ్యుడిగా ప్ర‌క‌టించాల‌ని వైసీపీ నాయ‌కులు కోరుకుంటున్నారు.

21 Replies to “జ‌గ‌న్ రాజ‌కీయ‌ గంజాయి వ‌నంలో తుల‌సి మొక్క‌!”

  1. అంటే…అయిదు ఏళ్ళ క్రితం దాకా ఎవరూ అయితే తాతని చంపారు అని నిందించమో వాళ్ళే తులసి మొక్కలు, మిగతా అంత గంజాయి వనం అంటావ్!!!!!

    1. ఆ పార్టీ లో తల్లిని ని, చెల్లి ని తిట్టిన వాళ్ళే తులసి మొక్కలు..

      ఒకప్పుడు ఇజయమ్మని తిట్టిన బొత్స..ఇప్పుడు తులసి వృక్షం..

  2. బాబోయ్… ఆర్టికల్ చడవకముందు హెడ్డింగ్ తప్పుగా అర్థం చేసుకున్నాను. హెడ్డింగ్

    “జగన్… రాజకీయ గంజాయి వనంలో తులసి మొక్క” అన్నావు అనుకొన్నా…

  3. సతీష్ రెడ్డి గారు మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి విలువలు ఉన్న నాయకుడు, జగన్ గారు సతీష్ రెడ్డి గారికి జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చి చాలా మంచిపని చేసారు, సతీష్ రెడ్డి గారి వాయిస్ జనాల్లోకి బాగా వెళ్తుంది. ఆయన పెట్టె ప్రెస్ మీట్లు చాలా బాగుంటాయి

    1. అంతటి సతీష్ రెడ్డి మీద రాజ రెడ్డి హంతకుడు అని ముద్ర వేసిన సన్నాసులు ఎవరు?

  4. ఒక్క అనంతపూర్ కే ఎందుకు? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నీ చేస్తే బాగుంటుందేమో???

  5. మా జగన్ అన్న గంజాయి వనంలో గన్నేరు మొక్క!

    మా అన్నతో పాటుగా పాదయాత్ర చేసిన అనుభవంతో చెబుతున్నాము. కార్యకర్తలను అంటరనివారిగా చూసిన చవట. మా అన్నని నమ్మకుని రాజకీయాలు చేయడం అంటే కుక్క తొక్క పెట్టుకుని గోదావరి ఈదినట్టే!

  6. మీరు పెట్టిన టైటిల్ (జగన్…..తులసిమొక్క)నిజం సార్….నిజమే సార్ …….నిజమే ..నమ్మండి సార్……ఆర్ని నిజమే అంటె నమ్మరేంటి సార్..

  7. మా జగనన్న గంజాయి వనంలో గన్నేరు మొక్క!

    మా అన్నతో పాటుగా పాదయాత్ర చేసిన అనుభవంతో చెబుతున్నాము. కార్యకర్తలను అంటరనివారిగా చూసిన వ్యక్తి. మా అన్నని నమ్మకుని రాజకీయాలు చేయడం అంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే!

  8. మా జగనన్న గంజాయి వనంలో గన్నేరు మొక్క!

    మా అన్నతో కలిసి పాదయాత్ర చేసిన అనుభవం గురించి చెబుతున్నాము. కార్యకర్తలను అంతరంగికంగా చూసిన వ్యక్తి. మా అన్నని నమ్మి రాజకీయాలు చేయడం అంటే, కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు!

  9. మా అన్న గంజాయి వనంలో గన్నేరు మొక్క!

    మా అన్నతో కలిసి పాదయాత్ర చేసిన అనుభవం గురించి చెబుతున్నాము. కార్యకర్తలను అంతరంగికంగా చూసిన వ్యక్తి. మా అన్నని నమ్మి రాజకీయాలు చేయడం అంటే, కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు!

  10. మా జగనన్న గంజాయి వనంలో గన్నేరు మొక్క!

    మా అన్నతో కలిసి పాదయాత్ర చేసిన అనుభవంతో చెబుతున్నాము…

  11. ఉండవయ్యా! నువ్వు, తు తు తు అని?! నీ హెడ్డింగ్ పోలీసులు చూసారంటే మ ద్యం కేసుకి గం జా యి కేసు తోడవుతుంది! అప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ?!..😀

  12. బతికి వున్నా ప్రాణులకు వైద్యం చేస్తారు చచ్చిన వాటికీ చేస్తే ఏమి ఉపయోగం ఫ్యూచర్ లో కేవలం జనసేన టీడీపీ మాత్రమే పోటీపడతాయి కావాలంటే వైసీపీ వేరే రూపం లో ప్రత్యేక రాయలసీమ ఉద్యమం చేసుకోవడమే అది కూడా కెసిఆర్ లాగా ఎవరైనా ఉద్యమం చేస్తుంటే దానికి మద్దతు ఇచ్చి పార్టీని నిలబెట్టుకోవడమే option వీళ్ళు ప్రత్యేక ఉద్యమం చేస్తే అక్కడ కూడా వీళ్ళను జనాలు నమ్మరు

Comments are closed.