ష‌ర్మిల పాత్ర పోషిస్తున్న పురందేశ్వ‌రి!

ష‌ర్మిల పాత్ర‌ను త‌మ నాయ‌కులైన పురందేశ్వ‌రి ఎందుకు పోషిస్తున్నారో ఎంత ఆలోచించినా అర్థ‌మే కావ‌డం లేద‌ని బీజేపీ నేత‌లు అంటున్నారు.

ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి… పేరుకే ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు. ఆమె మ‌న‌సంతా టీడీపీనే. సీఎం చంద్ర‌బాబునాయుడు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న తెలుగుదేశం పార్టీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు మిన‌హా, ఏపీలో బీజేపీ భ‌విష్య‌త్‌పై ఆమెకు చింత‌లేదు. పైగా ఏపీలో బీజేపీ బ‌ల‌ప‌డితే, టీడీపీ బ‌ల‌హీన‌ప‌డుతుంద‌నే భ‌యం ఆమెలో వుంద‌నే ఆరోప‌ణ‌ను కొట్టిపారేయ‌లేం. టీడీపీని కంటికి రెప్ప‌లా కాపాడేందుకు జాతీయ‌స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ మ‌ద్ద‌తు కోస‌మే, ఆమె ఏపీ బీజేపీలో ఉన్నార‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం.

తాజాగా వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుపై పురందేశ్వ‌రి కామెంట్స్‌పై బీజేపీ నాయ‌కులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు వైసీపీ నిజంగా మ‌ద్ద‌తు ఇచ్చి వుంటే, దాన్ని తీసుకొచ్చిన పార్టీకి ఏపీ అధ్య‌క్షురాలిగా అభినందించాల్సింది పోయి, విమ‌ర్శించ‌డం ఏంట‌ని సొంత పార్టీ వాళ్లే ప్ర‌శ్నిస్తున్నారు. వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుపై వైసీపీ ద్వంద్వ ప్ర‌మాణాలు పాటించింద‌ని, లోక్‌స‌భ‌లో వ్య‌తిరేకించి, రాజ్య‌స‌భ‌లో మ‌ద్ద‌తు ఇచ్చింద‌ని ఆమె విమ‌ర్శించారు.

నిజానికి పురందేశ్వ‌రి ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేదు. రాజ్య‌స‌భ‌లో వైసీపీ స‌భ్యుడు స‌త్వానీ మ‌ద్ద‌తు ఇచ్చారే త‌ప్ప‌, మిగిలిన స‌భ్యులంతా వ్య‌తిరేకంగా ఓటు వేశారు. అయిన‌ప్ప‌టికీ బీజేపీ కోణంలో చూస్తే, వైసీపీ ఆ పార్టీకి రాజ‌కీయంగా లాభమైన‌ప్పుడు పురందేశ్వ‌రి త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం ఏంటో అర్థం కావ‌డం లేద‌ని సొంత పార్టీ నాయ‌కులు మండిప‌డుతున్నారు. వైసీపీ తీరును ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల త‌ప్పు ప‌డితే అర్థం చేసుకోవ‌చ్చ‌ని అంటున్నారు.

కానీ ష‌ర్మిల పాత్ర‌ను త‌మ నాయ‌కులైన పురందేశ్వ‌రి ఎందుకు పోషిస్తున్నారో ఎంత ఆలోచించినా అర్థ‌మే కావ‌డం లేద‌ని బీజేపీ నేత‌లు అంటున్నారు. ఇంకా తానేమైనా కాంగ్రెస్‌లో లేదా టీడీపీలో వుంటున్న‌ట్టు భ్ర‌మిస్తున్నారా? అని పురందేశ్వ‌రిని దెప్పి పొడుస్తున్నారు. బీజేపీ నాయ‌కురాలిగా అనేక ప్ర‌యోజ‌నాలు పొందిన పురందేశ్వ‌రి, క‌నీసం ఆ పార్టీ రుణం తీర్చుకోడానికి మంచి చేయ‌క‌పోయినా, న‌ష్టం వ‌చ్చే ప‌ని చేయొద్ద‌ని బీజేపీ నాయ‌కులు వేడుకుంటున్నారు.

8 Replies to “ష‌ర్మిల పాత్ర పోషిస్తున్న పురందేశ్వ‌రి!”

  1. సొల్లు అప్పరా అయ్యా! Y.-.C.-.P మద్దతు ఇచ్చినట్టు National Media లొ కూడా వచ్చింది!

    .

    నువ్వు నిజంగా విప్ జారీ చెస్తె… బిల్లుకి వ్యతిరెకం గా ఎలా వొటు వెస్తారు?

    1. మినారిటీ లచె వొట్లు వెయించుకొని.. కెసుకులకి భయపడి అవి మొడీ కి అమ్ముకొనెది జగనె!

  2. 😂😂😂…..కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లి GA….రాజ్య సభ లో మీ భాగోతం అందరూ చూశారు GA….

Comments are closed.