జ‌గ‌న్ చుట్టూ స‌జ్జ‌ల‌, చెవిరెడ్డి.. కూట‌మిలో నాగ‌బాబు!

ఎంత‌సేపూ ఎదుటి వాళ్ల బ‌ల‌హీన‌త‌ల‌నే న‌మ్ముకోవ‌డం ఏపీ రాజ‌కీయాల ప్ర‌త్యేక‌త‌.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కోట‌రీలో ఎప్ప‌టికీ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి వుండాల‌ని టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు కోరుకుంటున్నారు. మ‌రోవైపు డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్న‌, జ‌న‌సేన రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబుకు కేవ‌లం ఎమ్మెల్సీ ప‌ద‌వితో స‌రిపెట్ట‌కుండా, మంత్రి ప‌ద‌వి ఇస్తే …రాజ‌కీయం రంజుగా వుంటుంద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.

వైసీపీ ప‌త‌నానికి, సీఎంగా జ‌గ‌న్ త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకోడానికి ప్ర‌ధాన కార‌కుడిగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని స‌మాజం చూస్తోంది. అలాగే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి త‌ప్పుడు స‌ర్వే నివేదిక‌లతో జ‌గ‌న్‌ను మ‌భ్య‌పెట్టి, వాస్త‌వాల్ని తెలియ‌కుండా చేసి, వైసీపీని నాశ‌నం చేశార‌నే భావ‌న వైసీపీ వ‌ర్గాల్లో బ‌లంగా వుంది. జ‌గ‌న్‌కు వాస్త‌వాలు రుచించ‌వ‌ని, నిజాలు “చెవి”కెక్క‌వ‌ని తెలిసే … భాస్క‌ర్‌రెడ్డి త‌న మార్క్ స‌ర్వే నివేదిక‌లు జ‌గ‌న్‌కు ఇచ్చార‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తుంటారు. జ‌గ‌న్‌కు నిజాలు అల‌వాటు, చెవిరెడ్డికి వాస్త‌వాలు చెప్పే స్వ‌భావం లేవని, చివ‌రికి కూచున్న చెట్టు కొమ్మ‌నే న‌రుక్కున్నార‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తుంటారు.

ఇక స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. జ‌గ‌న్‌ను సీఎంగా ఎన్నుకుంటే, టింగురంగా అంటూ ప్ర‌తిదానికీ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి , వైసీపీ కొంప ముంచ‌డాని రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌ది ఒక్క‌రూ చేసే విమ‌ర్శ‌. స‌జ్జ‌ల వ్య‌వ‌హార‌శైలి వ‌ల్లే ముఖ్యంగా వైసీపీ ప్ర‌భుత్వానికి, ఉద్యోగుల‌కు మ‌ధ్య దూరం పెరిగింద‌నే వాద‌న కూడా లేక‌పోలేదు. ఇంత జ‌రిగినా వాళ్లిద్ద‌రూ ఇప్ప‌టికీ వైఎస్ జ‌గ‌న్ కోట‌రీలో కీల‌క‌మైన నాయ‌కులు కావ‌డం విశేషం.

వాళ్లిద్ద‌రూ జ‌గ‌న్‌కు వైఫైలా చుట్టూ వుంటే చాలు… ఆ పార్టీకి, అధినాయ‌కుడికి ఎవ‌రూ ద‌గ్గ‌ర కాలేర‌ని టీడీపీ, జ‌న‌సేన అధినేత‌ల విశ్వాసం. మ‌ళ్లీ అధికారంపై న‌మ్మ‌కం …జ‌గ‌న్ చుట్టూ ఉన్న వాళ్లిద్ద‌రే అని కూట‌మి నేత‌లు సంతోషంగా చెబుతున్నారు.

ఇక వైసీపీ న‌మ్మ‌కం గురించి మాట్లాడుకుందాం. కూట‌మిలో నాగ‌బాబు కుంప‌టి పెడ‌తార‌ని వైసీపీ బ‌లంగా న‌మ్ముతోంది. ఇప్ప‌టికే పిఠాపురంలో నాగ‌బాబు వ్య‌వ‌హార శైలితో టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య పూడ్చ‌లేనంత‌గా అగాధం ఏర్ప‌డింది. రెండురోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం పిఠాపురం వెళ్లిన నాగ‌బాబుకు ఎలాంటి చేదు అనుభ‌వం ఎదురైందో అంద‌రికీ తెలిసిందే. ఎమ్మెల్సీ అయితేనే నాగ‌బాబు నోటి దురుసుతో, కూట‌మిలో అగ్గి రాజేశార‌ని, ఇక మంత్రి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే …కూట‌మిని త్వ‌ర‌గా విచ్ఛిన్నం చేస్తార‌నే భారీ ఆశ‌లు వైసీపీ పెట్టుకుంది.

నాగ‌బాబు నోటి దురుసును ఇప్ప‌టికే టీడీపీ జీర్ణించుకోలేక‌పోతోంది. అలాంటిది మంత్రి ప‌ద‌వి కూడా ఇస్తే, ఇక అంతే సంగ‌తుల‌ని టీడీపీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే నాగ‌బాబుకు మంత్రి ప‌ద‌వి ఇస్తున్న‌ట్టు చంద్ర‌బాబు అధికారికంగానే చాలా రోజుల క్రితం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కోతికి కొబ్బ‌రి చిప్ప ఇస్తే ఏమ‌వుతుందో, కొంద‌రికి మంత్రి ప‌ద‌వి ఇస్తే అదే అవుతుంద‌ని టీడీపీ నేత‌లు న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. నాగ‌బాబుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం అంటే, కూట‌మి త‌మ గోతిని తామేఉ త‌వ్వుకోవ‌డ‌మే అని వైసీపీ నేత‌లు భావిస్తున్నారు. ఆ రోజు కోసం వైసీపీ ఎదురు చూస్తోంది.

తాము మంచి ప‌నులు చేసి, ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌తో అధికారంలోకి రావ‌డ‌మో లేదా నిలుపుకోవ‌డ‌మో చేయాల‌న్న ఆలోచ‌న‌ల పాల‌క‌ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుల్లో ఏ మాత్రం లేదు. ఎంత‌సేపూ ఎదుటి వాళ్ల బ‌ల‌హీన‌త‌ల‌నే న‌మ్ముకోవ‌డం ఏపీ రాజ‌కీయాల ప్ర‌త్యేక‌త‌.

16 Replies to “జ‌గ‌న్ చుట్టూ స‌జ్జ‌ల‌, చెవిరెడ్డి.. కూట‌మిలో నాగ‌బాబు!”

  1. “టింగురంగా అంటూ ప్ర‌తిదానికీ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి , వైసీపీ కొంప ముంచ‌డాని రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌ది ఒక్క‌రూ చేసే విమ‌ర్శ‌.”..why blame sajjala…blame couple

  2. aayane vunte tella cheerenduku ani,

    jagan lo dammu vunte ee chevi reddy mukku reddy gajjala reddy yenduku?

    aada leka maddela odu ante ide,

    nee anna ni covering cheyya taniki, edo sodi chebuthavu ?

    sare reddy

    mari CBN coterie yevaru? power loki yevaru teccharu ?

  3. అవసరం అయితే తోసేడానికి ప్రతీ పార్టీ ఇలాంటి వారిని పెట్టుకుంటుందిగా.. మంచి పేరొస్తే నాయకుని ఘనత.. లేకపోతే మిడిల్ మాన్ తప్పు.. They are paid for that

Comments are closed.