జ‌గ‌న్ వ‌ద్ద చెవిరెడ్డికి కౌంట్‌డౌన్‌!

జ‌గ‌న్‌పై బాలినేని మాట్లాడిన చెడుకు, అదే రేంజ్‌లో కౌంట‌ర్ ఇవ్వాలి.

వైఎస్ జ‌గ‌న్ కోట‌రీలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి కీల‌క నాయ‌కుడు. మ‌హాత్మాగాంధీ సూక్తులంటే ఆయ‌న‌కు భ‌లే ఇష్టం ఉన్న‌ట్టుంది. జాతిపిత మ‌హాత్మాగాంధీజీ చెడు విన‌కు, చెడు చూడ‌కు, చెడు మాట్లాడ‌కు అని అన్నారు. గాంధీ గారి సూక్తిని చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకున్నారు. ఇప్పుడిదే ఆయ‌న్ను విమ‌ర్శ‌ల‌పాలు చేస్తోంది. అంతేకాదు, వైఎస్ జ‌గ‌న్‌కు చెవిరెడ్డిపై కోపం తెప్పించింద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.

గ‌త నెల‌లో పిఠాపురంలో జ‌న‌సేన ఆవిర్భావ స‌భ జ‌రిగింది. ఆ స‌భ‌లో మాజీ మంత్రి, జ‌న‌సేన సీనియ‌ర్ నాయ‌కుడు బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై రెచ్చిపోయారు. త‌న ఆస్తుల్ని జ‌గ‌న్ లాక్కున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. త‌న‌ను గెల‌కొద్ద‌ని, రానున్న రోజుల్లో మ‌రిన్ని వాస్త‌వాలు వెల్ల‌డిస్తాన‌ని వైసీపీకి గ‌ట్టి హెచ్చ‌రిక పంపారాయ‌న‌.

బాలినేనికి దీటైన కౌంట‌ర్ ఇవ్వాల్సిన బాధ్య‌త మాజీ ఎమ్మెల్యే, ఒంగోలు వైసీపీ సార‌థి చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డిపై వుంది. అంతేకాదు, జ‌గ‌న్ ఆరాధ‌కుడిగా, ప‌ర‌మ భక్తుడిగా త‌న దేవుడిపై బాలినేని అంతేసి బండ వేసిన‌ప్పుడు, చెవిరెడ్డి తీవ్రంగా స్పందించాల‌నేది వైసీపీ శ్రేణుల అభిప్రాయం. బాలినేనిని రాజ‌కీయంగా తుక్కు రేగ్గొట్టేంత వ‌ర‌కూ చెవిరెడ్డి నిద్ర‌పోకూడ‌ద‌ని కూడా వాళ్లు అంటున్నారు. జ‌గ‌న్‌పై ఈగ వాల‌నివ్వ‌కుండా కాపాడుకోవాల్సిన బాధ్య‌త చెవిరెడ్డిదే. ఎందుకంటే, జ‌గ‌న్‌కు నీడ‌లా నిత్యం వుంటున్న‌ది కూడా ఆయ‌నే కాబ‌ట్టి. ఇలాంటి అనేక కార‌ణాల్ని చూపుతూ, బాలినేనికి చెవిరెడ్డి కౌంట‌ర్ కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎదురు చూస్తున్నారు.

మ‌రోవైపు ఎవ‌రేం మాట్లాడాలో తాడేప‌ల్లి నుంచి పుడంగి దిశానిర్దేశం చేస్తుంటారు. అదేంటో గానీ, ప‌క్క‌నే ఉండే చెవిరెడ్డితో బాలినేనికి కౌంట‌ర్ ఇవ్వాల‌ని చెప్ప‌డం మ‌రిచిపోయిన‌ట్టున్నారు. మ‌రీ ముఖ్యంగా విజ‌య‌సాయిరెడ్డి, ష‌ర్మిల త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తే, స్వ‌యంగా జ‌గ‌నే ఎవ‌రెవ‌రు వాళ్ల‌కు కౌంట‌ర్ ఇవ్వాలో చెబుతుంటారు. బాలినేని త‌న‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించ‌గా, ఆ జిల్లా వైసీపీ బాధ్యుడిగా చెవిరెడ్డి కౌంట‌ర్ ఇవ్వ‌క‌పోవ‌డంపై జ‌గ‌న్ అసంతృప్తిగా ఉన్నార‌ని తెలిసింది. బాలినేని ఆరోప‌ణ‌లు త‌న‌కు తీవ్ర న‌ష్టం క‌లిగిస్తున్నా, విని కూడా ఏమీ ప‌ట్ట‌న‌ట్టు వుండావేం భాస్క‌ర్ అని ప్ర‌శ్నించిన‌ట్టు తెలిసింది.

అయిన‌ప్ప‌టికీ చెవిరెడ్డి స్పందించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. జ‌గ‌న్‌ను చెవిరెడ్డి వాడుకుంటాడే త‌ప్ప‌, ఆయ‌న అవ‌సరాల‌కు భాస్క‌ర్‌రెడ్డి లేర‌ని వైసీపీలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఏమీ లేని రోజుల్లో భాస్క‌ర్‌రెడ్డి దూకుడు ప్ర‌ద‌ర్శించార‌ని, గ‌త ఐదేళ్ల‌లో అన్నీ స‌మ‌కూర్చుకున్నార‌ని, ఇక వాటిని కాపాడుకోడానికి “చెవి” విన్నా, నోరు మాట్లాడ‌ద‌ని వైసీపీ నాయ‌కులు సెటైర్స్ విసురుతున్నారు. త‌ప్పించుకుని తిరుగువాడు ధ‌న్యుడు సుమ‌తి అని చెప్పిన‌ప్ప‌టికీ, రాజ‌కీయాల్లో అన్ని వేళ‌లా ఇది స‌రైంది కాద‌ని వైసీపీ నాయ‌కులు అంటున్నారు.

ఇప్ప‌టికే “చెవి”పై చాలా మంది క‌ళ్లు ప‌డ్డాయ‌ని, జ‌గ‌న్‌పై దారుణ విమ‌ర్శ‌ల‌కు కూడా కౌంట‌ర్ ఇవ్వ‌క‌పోతే, త‌న‌కు తాడేప‌ల్లిలో కౌంట్‌డౌన్ మొద‌ల‌వుతుంద‌ని భాస్క‌ర్‌రెడ్డి గ్ర‌హించాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే, జ‌గ‌న్ ఎప్పుడూ చెవిరెడ్డి మాట‌లే కాదు, ఇత‌రుల మాట‌లు కూడా వింటాడు. మ‌రీ ముఖ్యంగా నెగెటివిటీ అంటే జ‌గ‌న్ “చెవి”కోసుకుంటాడ‌ని భాస్క‌ర్‌రెడ్డికి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. జ‌గ‌న్ గురించి బాగా తెలిసిన నాయ‌కుల్లో చెవిరెడ్డి ఒక‌రు.

అందుకే జ‌గ‌న్‌పై బాలినేని మాట్లాడిన చెడుకు, అదే రేంజ్‌లో కౌంట‌ర్ ఇవ్వాలి. అంతేకాదు, బాలినేని చెడును చూస్తూ వుండాలి. మాట్లాడుతూ వుంటేనే, జ‌గ‌న్ వ‌ద్ద స్థానం సుస్థిరం. లేదంటే నీటి మీద బుడ‌గే అని అర్థం చేసుకోవాలి. త‌ల్లి, చెల్లితో తేడా వస్తే లెక్క చేయ‌ని జ‌గ‌న్‌, త‌న‌ను ఎప్పుడూ నెత్తిన పెట్టుకుంటాడ‌ని ఆశించొద్దు. జ‌గ‌న్ వ‌ద్ద ఎవ‌రికీ సుస్థిర‌మైన స్థానం వుండ‌దు. మారుతూ వుంటుంది. కావున జ‌గ‌న్ కోసం తాను సైతం అని చెవిరెడ్డి నిరూపించుకోవాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైంది.

26 Replies to “జ‌గ‌న్ వ‌ద్ద చెవిరెడ్డికి కౌంట్‌డౌన్‌!”

  1. నువ్వు అధికారం లో ఉన్న ఐదేళ్లు బాగా తిన్నావు కదా..

    అందుకే ప్రతిపక్షం లో ఉన్న ఐదేళ్లు.. అందరినీ తిడుతూ ఉండాలి..

    ఇదేనా పార్టీ నడిపే తీరు..

    ..

    అధికారం లో ఉన్న ఐదేళ్లు బాగా సంపాదించుకొన్నాడని.. ఎంత బాగా గొప్పగా రాసుకొంటున్నారో..

    ఆ ఐదేళ్లు దోచుకొన్నావు కాబట్టి.. ఈ ఐదేళ్లు బానిసగా బతుకుతూ ఉండాలి..

    ఎంత గొప్ప విధి విధానాలో …

    ..

    కూటమి ప్రభుత్వం పక్కాగా ఒక ప్రణాళిక తో వెళుతోంది..

    జగన్ రెడ్డి ని తప్పించి.. చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద కేసులు వేసేస్తోందని.. ఈ వైసీపీ పెద్ద తలకాయలకు అర్థమయిపోయింది..

    ఈ ఐదేళ్లు జగన్ రెడ్డి సేఫ్.. కానీ చుట్టూ ఉన్న తోడేళ్ళు మాత్రం ఎదో ఒక కేసులో జైలు కి వెళ్ళాలసిందే..

    జగన్ రెడ్డి మాట విని.. నోరు పారేసుకుంటే.. పోలీసులు చేయి పారేసుకొంటారు..

  2. నెగిటివిటి అంటే జగన్ “చెవి” కోసుకుంటాడా………ఆర్ని జగనన్న గురించి ఒక మంచి లక్షణమన్న చెపుతుఉండు GA…..అసలు లెవా?

  3. మావోడి మీద ఈగ.. ఈగ కూడా వాలనివ్వనని శపధాలు చేసిన వారిలో “గుట్కా నాని” బొంబాయ్ కి పారిపోయాడు.. అటునుంచి ఆటే లండన్ కి పరారీ అంటగా..?? మిగతావారి ఆచూకీ కూడా తెలియట్లేదు..

  4. రేపో మాపో మూసుకునేదానికి హడావుడి అవసరమా అని వైసీపీ లీడర్లు అనుకుంటున్నారు.

  5. ద్యావుడా.. గుట్కా గాడిది గుండెపోటు కాదు.. జెగ్గుల్ పోటు. ఎందుకంటే

    WHY NOT 175 అన్నోడు, అదఃపాతాళానికి తొక్కబడడానికి ప్రధాన కారకుల్లో ఒకడు..

    ఏదేమైనా వీడు త్వరగా రికవర్ కావాలి..

    ముందు చాలా ఫ్యూచర్ ఎంజాయ్ చెయ్యాలి..

  6. నన్ను గెలకొద్దు, గెలికితే మరిన్ని వాస్తవాలు బయటికి వస్తాయి అన్నాక కూడా గెలకడానికి భాస్కర్ రెడ్డి ఏమైనా పిచ్చోడా, జగన్ లా దద్దమ్మ నా

Comments are closed.