నిల‌క‌డ‌గా కొడాలి నాని ఆరోగ్యం!

ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్టు వైద్యులు చెప్పిన‌ట్టు, కొడాలి నాని అనుచ‌రులు తెలిపారు.

మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత కొడాలి నాని ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్టు తెలిసింది. గుండె సంబంధిత స‌మస్య‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న మొద‌ట హైద‌రాబాద్‌లోని ఏఐజీలో చికిత్స పొందారు. మెరుగైన వైద్యం కోసం ఆయ‌న్ను ముంబ‌య్‌కి తీసుకెళ్లాల‌ని కుటుంబ స‌భ్యులు వారం క్రిత‌మే నిర్ణ‌యించారు. ఉగాది పండుగ ఉండ‌డంతో పాటు వైద్యుల సూచ‌న‌తో ముంబ‌య్‌కి సోమ‌వారం త‌ర‌లించారు.

ముంబ‌య్‌లో ఆయ‌న‌కు ట్రీట్మెంట్ జ‌రుగుతోంది. శ‌స్త్ర‌చికిత్స చేసిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్టు వైద్యులు చెప్పిన‌ట్టు, కొడాలి నాని అనుచ‌రులు తెలిపారు. వైసీపీలో కొడాలి నాని ఫైర్‌బ్రాండ్‌గా పేరు పొందారు. గుడివాడ నుంచి వ‌రుస‌గా గెలుపొందుతూ వ‌చ్చిన కొడాలి… ఈ ద‌ఫా కూట‌మి సునామీలో ప‌రాజ‌యంపాల‌య్యారు. మ‌రోవైపు అనారోగ్య కార‌ణంతో కొంత‌కాలంగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా వుంటున్నారు.

జైల్లో ఉన్న వ‌ల్ల‌భ‌నేని వంశీని జ‌గ‌న్ ప‌రామ‌ర్శించే స‌మ‌యంలో ఆయ‌న వెంట కొడాలి నాని ఉన్నారు. ఆ త‌ర్వాత గుంటూరు మిర్చియార్డ్‌లో రైతుల ఆవేద‌న తెలుసుకోడానికి జ‌గ‌న్ వెళ్ల‌గా, ఆ స‌మ‌యంలో కూడా నాని ఉన్నారు. కేసుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. జైలుకెళ్ల‌డానికి తాము సిద్దంగా ఉన్నామ‌న్నారు.

అయితే అనారోగ్యంతో ఆయ‌న ఆస్ప‌త్రిపాలు కావ‌డంపై వైసీపీ శ్రేణుల్లో ఆందోళ‌న నెల‌కుంది. త్వ‌ర‌గా ఆయ‌న కోరుకుని తిరిగి రావాల‌ని వైసీపీ శ్రేణులు కాంక్షిస్తున్నాయి.

18 Replies to “నిల‌క‌డ‌గా కొడాలి నాని ఆరోగ్యం!”

  1. అసలే వైసీపీ లో “అందగాళ్ళ” సంఖ్య తగ్గిపోతోంది..

    ఈ అందగాడు.. త్వరగా కోలుకుని.. ఆంధ్ర రావాలి..

    ఆంధ్ర పోలీసులు ఈ అందగాడిని చెడ్డి లో కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి..

    రోజుకొక జైలుకి .. వారానికొక కోర్ట్ కి తిప్పాలి..

  2. అసలే వైసీపీ లో “అందగాళ్ళ” సంఖ్య తగ్గిపోతోంది..

    ఈ అందగాడు.. త్వరగా కోలుకుని.. ఆంధ్ర రావాలి..

    ఆంధ్ర పోలీసులు ఈ అందగాడిని చెడ్డి లో కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి..

    రోజుకొక జైలు కి .. వారానికొక కోర్ట్ కి తిప్పాలి..

  3. అసలే వైసీపీ లో “అందగాళ్ళ” సంఖ్య తగ్గిపోతోంది..

    ఈ అందగాడు.. త్వరగా కోలుకుని.. ఆంధ్ర రావాలి..

    ఆంధ్ర పోలీసులు ఈ అందగాడిని చెడ్డిలో కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి..

    రోజుకొక జైలుకి .. వారానికొక కోర్ట్ కి తిప్పాలి..

  4. Ika levadu..Desaalu daatipoye criminal plan esaadu.etla chesina naitikinnga Magaadu kaadani nirupinchukunnadu Gutka saale gaadu.Lokesh ni vedhavani cheddamanukuni vaade pedda 0.5 ayyaadu.

  5. సహజముగా ప్రతిక్కరిలోనే గుండె “లబ్ డబ్” అని శబ్దం చేస్తుంది, కానీ వైసీపీ నాయకులలో “రెడ్ బుక్” “రెడ్ బుక్” అని కొట్టుకుంటుందంట. ఇది AIG హాస్పిటల్ వారికి అర్ధం కాకనే నాని ని ముంబై పంపించారు.

  6. కొడాలి నాని ఆరోగ్య ఖర్చు లకి జగన్ కి ఫోన్ చేస్తే తిరిగి సమాధానం లేదు అంటున్నారు.

    నిజమే నా ,

    జగన్ కనీసం ఒక 10 కోట్లు రూపాయలు పంపి వింటారు అని కొడాలి నాని అనుచరులు గుసగుసలు.

Comments are closed.