డబ్బు కావాలంటే నేరుగా అడుగుతా: మంచు లక్ష్మి

తనకు డబ్బులు కావాలంటూ మంచు లక్ష్మి ఆన్ లైన్ లో కొందరి సంప్రదించారు. దీంతో చాలామంది అవాక్కయ్యారు.

తనకు డబ్బులు కావాలంటూ మంచు లక్ష్మి ఆన్ లైన్ లో కొందరి సంప్రదించారు. దీంతో చాలామంది అవాక్కయ్యారు. ఆమె పోస్టుకు స్పందించి ఎంతమంది డబ్బులు పంపించారో తెలియదు కానీ, అంతలోనే మంచు లక్ష్మి స్పందించారు. తన ఎకౌంట్ హ్యాక్ అయిందంటూ ఆమె ప్రకటించారు.

“నా ఎకౌంట్ హ్యాక్ అయింది. అందులో పోస్టులకు ఎవ్వరూ స్పందించొద్దు. నాకు డబ్బులు కావాలంటే నేరుగా అడుగుతా, సోషల్ మీడియాలో అడగను. ఎకౌంట్ నా ఆధీనంలోకి వచ్చిన వెంటనే చెబుతా.”

ఇలా తన ఎకౌంట్ హ్యాక్ అయిందనే విషయాన్ని మంచు లక్ష్మి బయటపెట్టారు. ఆమె ఫోన్ నంబర్ ను కూడా కనుగొన్నారు హ్యాకర్లు. ఎకౌంట్ హ్యాక్ అయిందని, హెల్ప్ కావాలంటే మెసేజ్ చేయమంటూ నేరుగా సంప్రదించారు. ఆ పోస్టును కూడా ఆమె ట్వీట్ చేశారు.

ఓ యాప్ లో డబ్బులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ దుండగులు, మంచు లక్ష్మి వాల్ పై లింకులు పెడుతున్నారు. వాటిని ఎవ్వరూ క్లిక్ చేయొద్దని లక్ష్మి విజ్ఞప్తి చేస్తున్నారు.