రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూ మళ్లీ తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే. నిన్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు, ప్రస్తుతం లావణ్య ఉంటున్న విల్లాలోకి (ఇది రాజ్ తరుణ్ దే) ప్రవేశించే ప్రయత్నం చేశారు. దీనిపై రాద్దాంతం జరిగింది.
ఎట్టకేలకు రాజ్ తరుణ్ తల్లిదండ్రుల్ని విల్లాలోకి అనుమతించింది లావణ్య. ఓవైపు వాళ్లను లోపలికి అనుమతిస్తూనే, మరోవైపు తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. 15 మందితో కలిసి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తనపై దాడి చేశారంటూ కంప్లయింట్ ఇచ్చింది.
“విల్లా రాజ్ తరుణ్ పేరు మీదనే ఉంది. ఐటీ అతడే కడుతున్నాడు. నేను గృహిణిగా ఆ ఇంట్లో ఉన్నాను. నాకు ఏ నోటీసులు రాలేదు. రాజ్ తరుణ్ తప్పించుకొని తిరుగుతున్నాడు. అతడు ఎక్కడో కూర్చొని గూండాల్ని పంపిస్తున్నాడు. అతడు నా ఎదురుగా వచ్చి మాట్లాడాలి. గతంలో ఫిలింఛాంబర్ ముందు ధర్నా చేస్తానని చెప్పాను, ఈసారి కచ్చితంగా చేస్తాను. ఎందుకంటే, అతడు ముందుకు రాకుండా, ఎక్కడో కూర్చొని నా మీదకు గూండాల్ని పంపిస్తే చూస్తూ కూర్చోను.”
గతంలో తన తండ్రి, రాజ్ తరుణ్ కలిసి ఆ విల్లాను కోటిన్నరకు కొనుగోలు చేశారని, ఇప్పుడు దాని విలువ 12 కోట్లు అయిందని అంటోంది లావణ్య. ఒకరి సమ్మతి లేకుండా మరొకరు ఆ విల్లాను అమ్మడానికి వీల్లేదంటూ ఒప్పందం రాసుకున్నట్టు తెలిపిన లావణ్య, రాజ్ తరుణ్ ఇల్లాలిగా ఆ ఇంటిపై సర్వహక్కులు తనకున్నాయని చెబుతోంది.
ప్రస్తుతం వ్యవహారం కోర్టులో ఉందని, అయినప్పటికీ రాజ్ తరుణ్ కిరాయి గూండాల్ని పంపించి దాడి చేయించాడని ఆరోపిస్తోంది లావణ్య. “చిన్నోడా నిన్ను కచ్చితంగా కోర్టు మెట్లు ఎక్కిస్తా..” అంటూ సవాల్ చేసింది.
Malli chetha publicity start