ఎక్స్‌క్లూజివ్ః ప‌వ‌న్‌, నాదెండ్ల మ‌నోహ‌ర్ మ‌ధ్య విభేదాలు

రాజ‌కీయంగా ఏ మాత్రం తేడా వ‌చ్చినా, ప‌వ‌న్ గురించి ప‌చ్చి నిజాలు బ‌య‌ట‌పెట్ట‌డానికి నాదెండ్ల వెనుకాడ‌ర‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి

జ‌న‌సేన అధ్య‌క్షుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఆ పార్టీ నంబ‌ర్ 2గా గుర్తింపు పొందిన మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ మ‌ధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. వాళ్లిద్ద‌రి మ‌ధ్య విభేదాల‌కు సంబంధించి “గ్రేట్ ఆంధ్ర‌” అందిస్తున్న ఎక్స్‌క్లూజివ్ క‌థ‌నం. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, మిత్రులుండ‌ర‌ని అనుభ‌వ‌జ్ఞులు ఊరికే చెప్ప‌లేదు. మ‌రీ ముఖ్యంగా అధికారం, డ‌బ్బు… ఈ రెండూ ఎవ‌రి మ‌ధ్యైనా చిచ్చు పెడ‌తాయి. ఇప్పుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, నాదెండ్ల మ‌నోహ‌ర్ మ‌ధ్య విభేదాల‌కు కూడా ఆ రెండే కార‌ణ‌మ‌ని అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు స‌మాచారం అందించాయి.

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు నీడ‌లా నాదెండ్ల మ‌నోహ‌ర్ ఉండ‌డం చూశాం. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు సంబంధించి ప్ర‌తి వ్య‌వ‌హారం మ‌నోహ‌ర్ చూసేవారు. నాదెండ్ల‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల్లో చేస్తున్న ఆర్థిక వ్య‌వ‌హారాలు కూడా తెలిసేవి. రాజ‌కీయాల్లో మార్గ‌నిర్దేశ‌కుడిగా నాదెండ్ల‌ను భావించ‌డం వ‌ల్లే, ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా ఇప్పించారు. నిజానికి నాదెండ్ల‌పై జ‌న‌సేన‌లో తీవ్ర‌మైన అసంతృప్తి వుంది. ప‌వ‌న్‌కు త‌ప్పుడు మార్గంలో నాదెండ్ల న‌డిపిస్తున్నార‌ని, త‌న స్వార్థం కోసం త‌మ నాయ‌కుడిని నాదెండ్ల వాడుకుంటున్నార‌నే ఆవేద‌న‌, ఆగ్ర‌హం జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్లో బ‌లంగా వుంది.

నాదెండ్ల‌ను గుడ్డిగా న‌మ్మితే మునిగిపోతావ‌ని ప‌వ‌న్‌ను శ్రేయోభిలాషులు హెచ్చ‌రించినా ప‌ట్టించుకోలేదు. ఎవ‌రైనా నాదెండ్ల‌పై విమ‌ర్శ‌లు చేస్తే, త‌న‌పై చేసిన‌ట్టే అని ప‌వ‌న్ బ‌హిరంగంగా హెచ్చ‌రించిన సంగతి తెలిసిందే. ఎందుకో గానీ, నాదెండ్ల‌పై ప‌వ‌న్‌లో అనుమానం పుట్టింది. నాదెండ్ల‌ను నెమ్మ‌దిగా దూరం పెడుతూ వ‌స్తున్నారు. దీంతో విభేదాలు తీవ్ర‌స్థాయికి చేరిన‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి.

ఆదాయ వనరులన్నీ పవన్ ఒక్కడే చూసుకోవడం, మరోవైపు తన సామాజిక వర్గానికే జనసేనలో ప్రాధాన్యం ఇస్తుండటాన్ని నాదెండ్ల జీర్ణించుకోలేకున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, పవన్ కల్యాణ్ తనకు తెలియకుండానే పార్టీలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని నాదెండ్ల గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం సినిమాలు తీస్తేనే డబ్బు వస్తుందని ఇంతకాలం చెబుతూ వచ్చిన పవన్ కల్యాణ్, అధికారంలోకి వచ్చిన తర్వాత మారిపోయాడని సన్నిహితుల వద్ద నాదెండ్ల ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

త‌మ్ముడు త‌మ్ముడే, పేకాట పేకాటే అనే చందంగా …ఆదాయం ద‌గ్గ‌రికి వ‌చ్చే స‌రికి త‌న‌ను ప‌క్క‌న పెట్ట‌డంపై నాదెండ్ల మ‌నోహ‌ర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్న‌ట్టు తెలిసింది. మ‌రోవైపు జ‌న‌సేన‌ను కుల‌పార్టీగా తయారు చేస్తున్నార‌నే అభిప్రాయం కూడా నాదెండ్ల‌లో వుంది. నాగ‌బాబుకు ఎమ్మెల్సీ, అలాగే మంత్రిని చేయాల‌న్న ప‌వ‌న్ నిర్ణ‌యంపై కూడా నాదెండ్ల‌కు న‌చ్చ‌లేద‌ని తెలిసింది. ఇది స‌రైంది కాదేమోన‌ని నాదెండ్ల చెప్పిన అభిప్రాయం ప‌వ‌న్‌కు ఏ మాత్రం రుచించ‌లేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

అయితే అధికారంలో వుండ‌డంతో ప‌వ‌న్‌, నాదెండ్ల మ‌ధ్య అంత‌ర్గ‌తంగా ఉన్న తీవ్ర విభేదాలు బ‌య‌టికి రావ‌డం లేదు. రాజ‌కీయంగా ఏ మాత్రం తేడా వ‌చ్చినా, ప‌వ‌న్ గురించి ప‌చ్చి నిజాలు బ‌య‌ట‌పెట్ట‌డానికి నాదెండ్ల వెనుకాడ‌ర‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. జ‌న‌సేన‌, టీడీపీలో కీల‌క నేత‌లంద‌రికీ ప‌వ‌న్‌, నాదెండ్ల మ‌ధ్య విభేదాల గురించి బాగా తెలుసు. ప్ర‌ధానంగా ఆదాయం వ‌ద్ద మొద‌లైన విభేదాలు… అనేక ర‌కాలుగా మ‌లుపులు తిరుగుతున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

32 Replies to “ఎక్స్‌క్లూజివ్ః ప‌వ‌న్‌, నాదెండ్ల మ‌నోహ‌ర్ మ‌ధ్య విభేదాలు”

  1. ఇప్పుడు నాగబాబు పార్టీలో no 2 అన్నమాట. ఇంక పార్టీ మూసుకోవడమే వాడి నోటి దూలతో.

  2. మావోడు ఈరోజు 11 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి ఏడుపు డ్రామా ఆడుతూ.. ప్యాలెస్ లో నువ్వో నేనో ఒక్కరే ఉండాలి.. నిన్ను ప్యాలెస్ బైటకి పంపేంతవరకు, నేను ప్యాలెస్ లో అడుగే పెట్టను అని లంగా శఫదం చేస్తాడట..

  3. నాదెండ్ల చేసింది ఏమీలేదు… మా నాగబాబు వచ్చాడుగా ఇంక పవన్ సీఎంగా చెయ్యటమే లక్ష్యం

  4. ఒక పధకం ప్రకారం వదంతులు సృష్టిస్తున్నారు…. ఎలా జరగాలి అని మీరు ఆశపడుతున్నారో అదే జరుగుతోంది అనే పుకార్లు పుట్టించేస్తే సరి….

  5. 😂😂😂😂…..మన అన్నయ్య పార్టీ మూసే స్తున్నాడని, యేమీ చేయలేక….. pawan kalyan మీద యేడుస్తున్నావా GA….

  6. పక్కొడి మీద పడి ఏడిస్తే .. మన గోచి గావంచా అవదు వెంకట్రావు ..

  7. అరేయ్ .. నీ బుర్రకి ఏమి తోస్తే అదే వ్రాస్తావా? ఇంత దరిద్రముగా కూడా ఆలోచనలు వస్తాయా?

  8. GA Venkat,

    it’s well known fact..

    mano gaadi father ntr ki chesina panulu telusu kada..

    same thing Ippudu pk ki veedu..

    same blood same dna..blood won’t change.

    eventually, Mano gaadu tdp loki, pk bjp ki.

    its just matter of time..

  9. డొక్కు ఫ్యాన్ పార్టు లు అమ్మకానికి పెట్టారు ఆన్లైన్ లో.

    యార్డ్ సేల్ కూడా వింది, ప్రతి ఆదివారం ప్యాలెస్ లో.. వచ్చి చెక్ చేసుకుని పట్టుకెళ్ళొచ్చు.

    ప్యాలెస్ పులకేశి ఒక కర్ర పట్టుకుని అక్కడ కుర్చీలో కూర్చొని వున్నాడు కానీ, అది మాత్రం అమ్మకానికి లేదు. కేవలం వచ్చిన వాళ్ళు ఇచిన డబ్బు లెక్క పెట్టుకుని ఆ పాత సామానులు కి కాపలాగా పెట్టారు అక్కడ.

  10. వాళ్ళ గొడవలు ఏవో వాళ్ళు చూసుకుంటారు లే కానీ,

    మన ప్యాలెస్ పులకేశి లాగ సొంత తల్లి, సొంత చెల్లి, సొంత తండ్రి, సొంత చిన్నాన్న నీ చేసినట్లు మాత్రం చేయదులే.

  11. అధికారం తో వచ్చే వాటాల దగ్గర తేడా అన్నమాట చక్కగా ఇద్దరికీ jobs వచ్చాయి పై ఆదాయం లో పైచేయి ఎవరికి అని తగాదా. కూటమి moral అదేగదా దోచుకో పంచుకో తినుకో

  12. Edhi plan lo ledhe

    11 సామ్యూల్ జగన్ రెడ్డి ప్లాన్ . ముందు ఉంది ముస్సుళ్ల పండుగ. 1. మాత కలహాలు 2. కులాలు మధ్య కొట్లాట 3. మాలలు, మాదిగలు మధ్య కొట్లాట 4. నైజీరియా గ్యాంగ్స్ తో స్కూల్స్ , కాలేజెస్ లో డ్రగ్స్ పంచడం. 5. కడప గాంగ్స్ తో మర్డర్స్ 6. Mumbai red light area + జబర్దస్త్ రోజా రెడ్డి + యాంకర్ శ్యామల రెడ్డి తో లో కి చొప్పించడం 7. కలకత్త gangs తో ఇళ్ల లో దొంగతనాలు 8. బీహార్ gangs తో దారి దోపిడులు.

    Show less

Comments are closed.