కూట‌మిలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల గుబులు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది గ‌డువు ఉన్న‌ప్ప‌టికీ, ఇప్ప‌టి నుంచే స‌న్నాహాలు చేస్తుండ‌డం విశేషం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది గ‌డువు ఉన్న‌ప్ప‌టికీ, ఇప్ప‌టి నుంచే స‌న్నాహాలు చేస్తుండ‌డం విశేషం. నిజానికి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లంటే, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అధికారంలో ఉన్న‌ప్పుడు నిర్వ‌హించ‌డానికి ఆయ‌న ఏ మాత్రం ఆస‌క్తి చూప‌రు. ఈ ద‌ఫా కూడా స్థానిక సంస్థ‌ల ఎన్నికల‌కు చంద్ర‌బాబు స‌ర్కార్ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు స‌హ‌క‌రించ‌ద‌నే భావ‌న అంద‌రిలోనూ వుంది.

కానీ మ‌రో ఏడాదిలో పంచాయ‌తీ, మున్సిప‌ల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు అధికార యంత్రాంగాన్ని స‌మాయ‌త్తం చేసేందుకు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నీలం సాహ్ని జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు చేప‌ట్టారు. ఈ మేర‌కు క‌లెక్ట‌ర్లు, జాయింట్ క‌లెక్ట‌ర్లు, ఇత‌ర అధికార యంత్రాంగంతో ఆమె స‌మావేశాలు నిర్వ‌హించ‌డానికి శ్రీ‌కారం చుట్టారు. ఇందులో భాగంగా ఆమె తిరుప‌తి అధికార యంత్రాంగంతో స‌మావేశం నిర్వ‌హించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

చంద్ర‌బాబు స‌ర్కార్ పాల‌న 11వ నెల‌లో అడుగు పెట్ట‌నుంది. స్థానిక సంస్థ‌లకు స‌రైన స‌మ‌యానికి ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే, అప్ప‌టికి బాబు స‌ర్కార్ పాల‌న రెండేళ్లు పూర్తి చేసుకుంటుంది. అప్ప‌టికి చంద్ర‌బాబు ప్ర‌భుత్వ పాల‌న‌పై జ‌నానికి ఒక అభిప్రాయం ఏర్ప‌డుతుంది. ప‌ది నెల‌ల‌కే తీవ్ర అసంతృప్తి వుంద‌నే మౌత్ పబ్లిసిటీ తెచ్చుకుంది. ఈ నేప‌థ్యంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రిగి, ఫ‌లితాలు కూట‌మికి కాస్త వ్య‌తిరేకంగా వ‌చ్చినా, ఇక సార్వ‌త్రిక ఎన్నిక‌ల వ‌ర‌కూ పాల‌న స‌జావుగా సాగే ప‌రిస్థితి వుండ‌ద‌ని ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు బాగా తెలుసు.

పోలీసులు, ఇత‌ర ప్ర‌భుత్వ శాఖ‌ల ఉద్యోగుల్ని అడ్డం పెట్టుకుని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ స‌భ్యుల్ని నామినేష‌న్లు వేయ‌కుండా అడ్డుకోవ‌చ్చు. ఒక‌వేళ అలాంటి చ‌ర్య‌ల‌కు అధికారాన్ని అడ్డు పెట్టుకుని కూట‌మి నేత‌లు పాల్ప‌డినా, ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త త‌ప్ప‌దు. గ‌తంలో వైసీపీ ఇలా చేసే, ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను మూట‌క‌ట్టుకుంది. నిజంగా ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై ఎలాంటి అభిప్రాయం వుందో తెలుసుకోడానికి పార‌ద‌ర్శ‌కంగా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే మంచిదే. కానీ కూట‌మి ప్ర‌భుత్వం అంత గొప్ప‌గా ఆలోచిస్తుంద‌నే భ్ర‌మ‌లు ఎవ‌రికీ లేవు.

ఏదో ర‌కంగా స్థానిక సంస్థ‌ల‌న్నింటినీ సొంతం చేసుకోడానికి ఎందాకైనా అన్న‌ట్టు అరాచ‌కాల‌కు తెర‌లేపే ప్ర‌మాదం వుంది. అయితే వైసీపీ కూడా దూకుడు ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం వుంది. కూట‌మి ప్ర‌భుత్వం పెట్టిన కేసులు, వేధింపుల పుణ్య‌మా అని వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్లో తెగింపు, ధైర్యం క‌నిపిస్తున్నాయి. మ‌రో ఏడాది గ‌డిస్తే కూట‌మి అధికారాన్ని, నాయ‌కుల్ని లెక్క చేసే ప‌రిస్థితి వుండ‌దు. ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డ‌డానికి వైసీపీ రెడీగా వుంటుంది. ఈ ప‌రిణామాల రీత్యా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లంటేనే కూట‌మిలో గుబులు రేపుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

11 Replies to “కూట‌మిలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల గుబులు!”

  1. గతంలో జరిగిన స్ధానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయో ఎలా గెలిచారో ఒక్క ఆర్టికల్ అయిన రాశారా

  2. ప్రతిపక్షహోదా ఇవ్వడం లేదు ప్రత్యేకహోదా కూడా మోడీ ఇవ్వడం లేదు ఇదివరకటి లాగా రాజీనామా చేసి జనం లోనికి సింహం లాగా వెళ్ళండి బాబుగారు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోతేనేమి జనం లో కూటమి మీద ఉన్న వ్యతిరేకత తో గెలవండి పోతే ఒక ఏడూ సీట్ లు పోతాయి అంతే ఎలాగూ అసెంబ్లీ కి వెళ్ళటం లేదుకదా

  3. ఏమో…..నాకైతే ఓడిపోయాకా జలగన్న ఏడుపే బాగా నచ్చింది . ఆ ఏడుపు ఎప్పటికీ అలాగే ఉండాలని జనాల ఆశ..

  4. ఎన్నికలు సజావుగా జరగవు అని ఒక మాట నేస్తే, కూటమి గెలిచాక ఆ మాట వాడుకోవచ్చు అని ఒక మాట అనేసి ఉంచాడు మా వెంకీ

Comments are closed.