పవన్ కళ్యాణ్ ఇంటికి బన్నీ!

హీరో బన్నీ ఈ రోజు సాయంత్రం ఆరున్నరకు నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారని తెలుస్తోంది.

హీరో బన్నీ ఈ రోజు సాయంత్రం ఆరున్నరకు నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారని తెలుస్తోంది. పవన్ కుమారుడు శంకర్ కు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

రెండు రోజుల క్రితమే సింగపూర్ నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో బన్నీ నేరుగా ఈ సాయంత్రం తానే పవన్ ఇంటికి వెళ్లి గంట సేపు అక్కడే గడిపి వచ్చినట్లు తెలుస్తోంది. సంధ్య థియేటర్ సంఘటన తరువాత పవన్-బన్నీ కలయిక ఇదే కావచ్చు.

పవన్ కుమారుడి ప్రమాదం వార్త తెలిసాక పెద్ద చిన్న అంతా ట్వీట్ లు వేసారు. సందేశాలు పంపారు. కానీ బన్నీ మాత్రం అలా చేయలేదు. కానీ బన్నీ టీమ్ వైపు నుంచి తెలుస్తున్నది ఏమిటంటే అదే రోజు ఫోన్ లో మాట్లాడారని. ఫోన్ లో మాట్లాడిన సంగతి అందరికీ తెలియదు కదా. ముఖ్యంగా ఇరు వైపుల ఫ్యాన్స్ కు.

ఇప్పుడు కూడా బన్నీ వెళ్లి పరామర్శించి వచ్చిన సంగతిని ఇరు వైపుల నుంచి బయటకు వదలలేదు. వాళ్లు వదులుతారని వీళ్లు, వీళ్లు వదులుతారని వాళ్లు వెయిట్ చేస్తున్నాురు. చూడాలి ఎవరు ముందుగా బయటకు చెబుతారో?

18 Replies to “పవన్ కళ్యాణ్ ఇంటికి బన్నీ!”

  1. So vadu phone lo matladina evariki teliyaledu ante adi gossipe enduku ante .. gutka gadi PR team antha waste em kadu. Vadu emchesina public loki vatchela chestaru 

Comments are closed.