ప్రపంచ ప్రసిద్ధ గోల్కొండ డైమండ్ అమ్మకానికొచ్చింది. కావాలంటే దీన్ని మీరు కూడా కొనుక్కోవచ్చు. జెనీవాలోని క్రిస్టీస్ మ్యూజియంలో ఈ అరుదైన నీలం రంగు వజ్రాన్ని వేలం వేయబోతున్నారు.
క్రిస్టీస్ లో వేలం పాటలు కామన్. కానీ గోల్కొండ డైమండ్ లాంటి అరుదైన వజ్రాల్ని వేలం వేయడం మాత్రం చాలా అరుదు. ఇది అలాంటి సందర్భమే. ఈ వజ్రాన్ని వేలం వేయడం ద్వారా 300 కోట్ల రూపాయల నుంచి 430 కోట్ల రూపాయలు సమీకరించాలని భావిస్తోంది క్రిస్టీస్.
అంటే, ఈ వజ్రం వేలం పాట 300 కోట్ల రూపాయల నుంచి మొదలవుతుందన్నమాట. ఇది ఎంతకు అమ్ముడుపోతుంది, ఎవరు దక్కించుకోబోతున్నారో తెలియాలంటే మే 14వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.
వేలం పాటల్లో ఇప్పటివరకు అత్యథిక ధరకు అమ్ముడుపోయిన వజ్రం ‘ఓపెన్ హైమర్ బ్లూ’ అనే డైమండ్. తళతళలాడే ఈ నీలం రంగు డైమండ్ 2016లోనే 57.5 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. ఇప్పటి కరెన్సీ లెక్కల్లో చెప్పాలంటే దాదాపు 500 కోట్ల రూపాయలు. ఈ రికార్డును గోల్కొండ డైమండ్ అధిగమిస్తుందేమో చూడాలి.
భారత్ లోని అత్యంత పురాతన వజ్రాల్లో ఒకటి గోల్కొండ డైమండ్. గోల్కొండ గనుల నుంచి దీన్ని వెలికితీసినట్టు చెబుతారు. ఇండోర్ మహారాజు యశ్వంత్ హోల్కర్-2 ఈ వజ్రాన్ని దక్కించుకున్నప్పట్నుంచి డాక్యుమెంట్ ఆధారాలున్నాయి. అయితే అంతకు వందేళ్ల ముందు నుంచే ఈ డైమండ్ మనుగడలో ఉన్నట్టు చెబుతారు చరిత్రకారులు. మరీ ముఖ్యంగా 1292లో మార్కోపోలో తన రచనల్లో ఈ అద్భుతమైన వజ్రం గురించి రాసినట్టు చెబుతారు.
reddy,
denni mana jagan anna koni harathi isthademo
piga rangu kooda match ayyindi !!!!
wonder where were these Golconda mines located?
twitter tillu godava cheyyali we demand