విచారణకు రావాల్సిందిగా ఈడీ ఇచ్చిన నోటీసులపై మహేష్ బాబు స్పందించాడు. సినిమా షూటింగ్ కారణంగా చెప్పిన తేదీకి తను విచారణకు రాలేకపోతున్నానని మెయిల్ ద్వారా సమాచారం అందించాడు. మరో తేదీ ఇవ్వాలని కోరాడు. మహేష్ బాబు విజ్ఞప్తిని ఈడీ అధికారులు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
గతంలో సాయిసూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రచారం చేశారు మహేష్ బాబు. ఏకంగా కుటుంబ సమేతంగా ఆ కంపెనీ యాడ్ లో నటించాడు. తొలిసారి కుటుంబంతో కలిసి చేసిన యాడ్ కావడంతో కాస్త గట్టిగానే ఛార్జ్ చేశాడట. తాజా సమాచారం ప్రకారం, 5 కోట్ల 90 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నాడట మహేష్.
ఇందులో కొంత మొత్తాన్ని మహేష్ కు ఆన్ లైన్ ట్రాన్సఫర్ చేసిన సాయిసూర్య డెవలపర్స్, మరికొంత మొత్తాన్ని నగదు రూపంలో చేతికి అందించినట్టు తెలుస్తోంది. దీనిపై ఈడీకి కొన్ని అనుమానాలున్నాయి. అందుకే విచారణకు రావాల్సిందిగా నోటీసులిచ్చింది.
సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పై ఈడీ దాడులు నిర్వహించింది. దాడుల్లో భాగంగా ఎన్నో అవకతవకలు గుర్తించింది. అక్రమంగా లే-అవుట్స్ వేయడం, ఒకే ఫ్లాట్ ను వివిధ వ్యక్తులకు అమ్మడం, అగ్రిమెంట్లు లేకుండా డబ్బులు తీసుకోవడం లాంటి ఎన్నో మోసాల్ని గుర్తించింది. ఇందులోనే మహేష్ బాబు చెల్లింపుల లెక్కలు కూడా బయటపడ్డాయి. దీనిపై మరింత స్పష్టత కోసం మహేష్ ను విచారణకు రావాల్సిందిగా సూచించింది.
మరీ ముఖ్యంగా నగదు రూపంలో తీసుకున్న మొత్తానికి మహేష్ బాబు పన్నులు చెల్లించాడా లేదా అనే కోణంలో ప్రశ్నించబోతోంది ఈడీ. రేపు మహేష్ విచారణకు రాలేనని చెప్పడంతో, మరో తేదీకి రావాల్సిందిగా మరో నోటీసు ఇచ్చే అవకాశం ఉంది.
మామూలు జనాల కి లక్ష కంటే ఎక్కువ విన్న ప్రతిదీ, బ్యాంక్ ద్వారానే చెల్లుబాటు చేయాలి అని నీతులు చెబుతారు కదా. డబ్బులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆ నీతులు వర్తించవన?
ఆ యాడ్ చూసి అక్కడ ఫ్లాట్ కొని మోసపోయిన వాళ్ళ అందరికీ , మహేశ్ ఆస్తులు లో వసూలు చేసి, వాళ్ళకి ఆ నష్టం పూడచాలి.