అది స్టుపిడ్ కాన్సెప్ట్ – నాని

చేతిలో మైక్ ఉంది, ఎదురుగా కెమెరాలున్నాయి కాబట్టి నాని డిప్లమాటిక్ గా సమాధానం ఇచ్చి ఉండొచ్చు.

తెలుగులో వంద కోట్ల హీరోలు కొంతమంది ఉన్నారు. ఆ జాబితాలోకి చేరాలని చాలామంది తహతహలాడుతుంటారు. వాళ్ల ప్రతి సినిమా ప్రయత్నం కూడా అదే. ఈ లిస్ట్ లోకి నాని కూడా చేరాడు. మరి నాని రియాక్షన్ ఏంటి? ఆయన టయర్-1 లో చేరిపోయినట్టేనా?

ఈ ప్రశ్నకు నాని సూటిగా సమాధానం చెప్పలేదు. హీరోల్ని అలా కేటగిరీల కింద విడదీయొద్దంటూనే, దాన్ని స్టుపిడ్ కాన్సెప్ట్ గా చెప్పుకొచ్చాడు.

“టయర్-1 హీరో, టయర్-2 హీరో అనే పదాల్ని మీడియా సృష్టించింది. అది డిక్షనరీలో ఉన్న పదం కాదు. వీటి గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు, ఆలోచించను కూడా. ఎవరి సినిమాలు వాళ్ల బడ్జెట్స్ కు తగ్గట్టు చేసుకుంటూ వెళ్తున్నారు. ట్రైన్ లో బోగీల్లా సెపరేట్ చేసి హీరోల్ని ఎందుకు కూర్చోబెడుతున్నారో తెలియదు. ఇది చాలా స్టుపిడ్ కాన్సెప్ట్.”

ఈ కాన్సెప్ట్ ను ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు కానీ, అందరం కలిసి ఆ సంస్కృతిని పెంచి పోషిస్తున్నామన్నాడు నాని. ఈ కల్చర్ ను ఆపినప్పుడు మాత్రమే ఇండస్ట్రీ బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

చేతిలో మైక్ ఉంది, ఎదురుగా కెమెరాలున్నాయి కాబట్టి నాని డిప్లమాటిక్ గా సమాధానం ఇచ్చి ఉండొచ్చు. కానీ హీరోల రేంజ్ ను డిసైడ్ చేసేవి కలెక్షన్లు మాత్రమే అనే విషయం, కింద స్థాయి నుంచి స్టార్ గా ఎదిగిన నానికి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు.

పైకి చెప్పకపోయినా వంద కోట్ల క్లబ్ ను టార్గెట్ గా పెట్టుకున్నాడు కాబట్టే పాన్ ఇండియాకు కనెక్ట్ అయ్యేలా ఇలాంటి వయొలెంట్ సినిమాలు చేస్తున్నాడు. చివరికి తన కోర్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం హిట్-3 సినిమాకు రావొద్దని చెబుతున్నాడు.

3 Replies to “అది స్టుపిడ్ కాన్సెప్ట్ – నాని”

  1. Aa question adigindi kuda Great andhra Murthy gade kada..vayasu vachindi kaani veediki inka maturity raaledu..stupid question adugutadu..taata vastade..de*ngulu tini pothade

  2. మీడియా ని కూడా అలాగే విడదీస్తే, మూర్తి తాత, వాడి website టైర్-4 అవుతారా, స్టెప్నీ టైర్ అవుతారా ?

Comments are closed.