పూరి బెగ్గర్ తో రాధిక ఆప్టే

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి- టబులతో నిర్మించే మల్టీ లాంగ్వేజ్ సినిమాకు రాధిక ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

దాదాపు పదేళ్లు అవుతోంది సీనియర్ హీరోయిన్ రాధిక ఆప్టే తెలుగు తెరపై కనిపించి. బాలయ్య పక్కన చేసింది లయన్ అనే ఓ సినిమా. తరువాత మళ్లీ తెలుగు తెర మీదకు రాలేదు.

అప్పుడు అప్పుడు ఇంటర్వూల్లో సౌత్ ఫిల్మ్స్ జనాలు అంటూ ఏదో ఒకటి మాట్లాడడం తప్ప. ఇప్పడు మళ్లీ ఓ పాన్ ఇండియా సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి- టబులతో నిర్మించే మల్టీ లాంగ్వేజ్ సినిమాకు రాధిక ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి వుంది. ఈ సినిమాలో నటించే నటుల జాబితా కాస్త పెద్దదే వుంటుందని తెలుస్తోంది. అయితే ఒక్కొక్కటీ అనౌన్స్ చేస్తూ సినిమాకు బజ్ పెంచే పనిలో వున్నారు. సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో వున్నారు దర్శకుడు పూరి జగన్నాధ్.

లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు డిజాస్టర్ కావడంతో, ఈసారి గట్టిగా బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తున్నారు పూరి జగన్నాధ్. అందుకోసం చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

2 Replies to “పూరి బెగ్గర్ తో రాధిక ఆప్టే”

  1. అమ్మాయిలు ఇకనుంచి చొక్కాలు ఇలాగే వే సుకుంటారన్నమాట….ఒకప్పుడు అబ్బాయిల్ని ఇలా చూసి రౌడీ వేషాలు….అన్నారు.

    మరి ఇప్పుడో…..

Comments are closed.