అమ‌రావ‌తి రైతులు మ‌ళ్లీ పాద‌యాత్ర చేస్తారా?

ఇప్ప‌టికే ధ‌ర‌ల్లేని త‌మ భూములకు డిమాండ్ మ‌రింత ప‌డిపోతుంద‌ని రాజ‌ధాని రైతులు ఆందోళ‌న చెందుతున్నారు.

అమ‌రావ‌తి అంటే ప్రాణ‌మిచ్చే చంద్ర‌బాబునాయుడు సీఎం కావ‌డంతో, త‌మ‌కు అన్నీ మంచి రోజులే అని రాజ‌ధాని రైతులు సంతోషించారు. అయితే వాళ్ల ఆనందాన్ని కూట‌మి ప‌ది నెల‌ల పాల‌న ఆవిరి చేసింది. జ‌గ‌న్ హ‌యాంలో ఒక ర‌క‌మైన న‌ష్టం జ‌రిగితే, ఇప్పుడు చంద్ర‌బాబు పాల‌న‌లో మ‌రో ర‌కంగా న‌ష్ట‌పోవాల్సి వ‌స్తోంద‌ని రాజ‌ధాని రైతులు అల్లాడిపోతున్నారు. పాల‌కులు అన్యాయం చేసిన‌ప్పుడ‌ల్లా న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించ‌డం రాజ‌ధాని రైతుల‌కు ప‌రిపాటైంది.

ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ పాద‌యాత్ర మొద‌లు పెట్టే అవ‌కాశం వుందా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. వైసీపీ పాల‌న‌లో రెండు ద‌ఫాలు రాజ‌ధాని రైతులు పాద‌యాత్ర చేసిన సంగ‌తి తెల‌సిందే. 2019, డిసెంబ‌ర్ 17న అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో అమ‌రావ‌తి రైతులు ఆ మ‌రుస‌టి రోజే రోడ్డెక్కారు.

అమ‌రావ‌తి నిర్మాణానికి 29 గ్రామాల ప‌రిధిలోని 29,881 మంది రైతులు 34,322 ఎక‌రాలు ఇచ్చారు. అలాగే ప్ర‌భుత్వ‌, దేవాదాయ‌, ఇత‌ర‌త్రా భూముల‌న్నీ క‌లుపుకుని రాజ‌ధానికి 58 వేల ఎక‌రాల‌ను నాడు చంద్ర‌బాబు స‌ర్కార్ సేక‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌తో ఒప్పందాన్ని ఉల్లంఘించిన‌ట్టైంద‌ని రాజ‌ధాని రైతులు అవిశ్రాంత పోరాటం చేశారు.

2021, న‌వంబ‌ర్ 1న న్యాయ స్థానం టు దేవ‌స్థానం పేరుతో అమ‌రావ‌తి నుంచి తిరుప‌తి వ‌ర‌కూ 57 రోజుల పాటు పాద‌యాత్ర చేశారు. ఆ త‌ర్వాత ఏడాది శ్రీ‌కాకుళం జిల్లా అర‌స‌వ‌ల్లి ఆల‌యానికి పాద‌యాత్ర చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ యాత్ర అర్ధంత‌రంగా ఆగిపోయింది. ఏపీ హైకోర్టులో రాజ‌ధాని రైతుల‌కు అనుకూల‌మైన తీర్పు వ‌చ్చింది.

ఆ త‌ర్వాత ప్ర‌జాకోర్టులో అంటే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి మూటక‌ట్టుకుంది. చంద్ర‌బాబు స‌ర్కార్ కొలువుదీర‌క‌నే రాజ‌ధానిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రిచారు. తాజాగా మ‌రో 44 వేల ఎక‌రాల్ని సేక‌రించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించ‌డంతో రాజ‌ధాని రైతులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. దీంతో హైకోర్టును ఆశ్ర‌యించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

రాజ‌ధాని రైతుల ఆవేద‌న‌లో న్యాయం వుంది. చంద్ర‌బాబు మొట్ట‌మొద‌ట తీసుకున్న భూముల్ని అభివృద్ధి చేసి, ప్లాట్ల‌గా వేసి ఇవ్వాల్సి వుంది. ఆ ప్లాట్లకు రేట్లు వ‌స్తే, అమ్ముకుంటే న్యాయం జరుగుతుంది. అయితే ఇంత వ‌ర‌కూ రాజ‌ధాని భూములు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. చంద్ర‌బాబు స‌ర్కార్ ఇచ్చిన మాట నిల‌బెట్టుకోక‌పోగా, ఇప్పుడు మ‌ళ్లీ 44 వేలు ఎక‌రాలు తీసుకుని అభివృద్ధి చేస్తామ‌న‌డంతో వాళ్లు ఆందోళ‌న చెందుతున్నారు.

అదే జ‌రిగితే, ఇప్ప‌టికే ధ‌ర‌ల్లేని త‌మ భూములకు డిమాండ్ మ‌రింత ప‌డిపోతుంద‌ని రాజ‌ధాని రైతులు ఆందోళ‌న చెందుతున్నారు. రాజ‌ధానికి భూములు ఇచ్చిన పాపానికి స‌ర్వం కోల్పోయి రోడ్డున ప‌డ‌తామ‌నే రైతుల ఆందోళ‌న‌ల్ని ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అందుకే ఒక వైపు న్యాయ‌పోరాటం, మ‌రోవైపు ప్ర‌జాపోరాటానికి రాజ‌ధాని రైతులు శ్రీ‌కారం చుడ‌తారా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

8 Replies to “అమ‌రావ‌తి రైతులు మ‌ళ్లీ పాద‌యాత్ర చేస్తారా?”

  1. The State Government decision is incorrect. First, the State Government should develop the Amaravati capital an extent of Ac.34 324 .00 cents by alloting plots to the farmers and construction of AP Secretariat and Permanent High Court and MLA building etc., as per plans and then think about acquisition of additional lands by land pooling.

  2. మూడు రాజధానుల శిబిరంలో ఎప్పుడు మొదలుపెడుతున్నారు ధర్నాలు, దీక్షలు..

Comments are closed.