సెకెండ్ ఇన్నింగ్స్ లో త్రిష దూసుకుపోతోంది. వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. కేవలం కోలీవుడ్ లోనే కాదు, తెలుగులో కూడా ఆమె మంచి ప్రాజెక్టుల్లో కనిపించబోతోంది. చిరంజీవి సరసన ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తోంది.
ఇప్పుడామె పేరు మరోసారి టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈసారి రెండు సినిమాలకు సంబంధించి త్రిషపై చర్చ జరగడం విశేషం. అందులో ఒక మూవీ మహేష్-రాజమౌళి ప్రాజెక్టు.
ఈ సినిమాలో ఇప్పటికే ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆల్రెడీ షూటింగ్ కూడా కొనసాగిస్తున్నారు. మరో కీలక పాత్ర కోసం త్రిషను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు గాసిప్స్ వస్తున్నాయి.
ఇక త్రిష పేరు మరో సినిమాలో కూడా వినిపిస్తోంది. విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ కాంబోలో కొత్త సినిమా రాబోతోంది. ఇందులో మెయిన్ ఫిమేల్ లీడ్ గా టబును తీసుకున్నారు. ఇప్పుడు మరో కీలకమైన పాత్ర కోసం త్రిషను సంప్రదించాడట పూరి జగన్నాధ్. ఇంతకుముందు త్రిష-పూరి కాంబోలో ‘బుజ్జిగాడు’ వచ్చింది.
ఒరిపిడి కందెనలు తక్కువ అయినా పూరి తినాలని ఉంది అంటే ఎవరు కాదనగలరు?
Mussalollaki makeup vesi heroines antunnaru