సపోజ్.. ఫర్ సపోజ్.. అల్లు అర్జున్ కనుక గురూజీ త్రివిక్రమ్‌తో మీరు ఓ సినిమా చేసుకుని రండి.. అని గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎవరితో చేస్తారు? తెగ గ్యాసిప్ లు వున్నాయిగా, రామ్ అని విక్టరీ వెంకటేష్ అని.. అక్కడే తప్పులో కాలేసారు. త్రివిక్రమ్ చూపు ఇక్కడ లేదు. తమిళ హీరో శివకార్తికేయన్ వైపు వుంది.
త్రివిక్రమ్ తో సినిమా చేస్తే కనీసం థియేటర్.. నాన్ థియేటర్ 100 కోట్లకు పైగా మార్కెట్ అవ్వాలి. కనీసం రెండు రాష్ట్రాల్లో థియేటర్ మీద నుంచి కనీసం మరో వంద కోట్లు రావాలి. నూట పాతిక కోట్లతో నిర్మించినా మంచి లాభాలు మిగలాలి.
టాప్ లైన్ ఆర్డర్ పక్కన పెట్టి, మిగిలిన ఏ హీరోతో త్రివిక్రమ్ చేసినా వంద కోట్ల మార్కెట్ దాటడం కష్టం. అదే కనుక తమిళంలో పాపులారిటీ వుండి, తెలుగు నాట కూడా పరిచయం అయిన హీరోతో చేస్తే డబుల్ ధమాకా అవుతుంది. అందుకే త్రివిక్రమ్ చూపు తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్ వైపు వుంది. శివకార్తికేయన్ కూడా రెడీగానే వున్నారు.
కానీ బన్నీ దగ్గర విషయం తేలాల్సి వుంది. అట్లీ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ షెడ్యూలుకు బన్నీ ఎప్పుడు టైమ్ కేటాయిస్తారు. లేదా అట్లీ సినిమా అయ్యే లోగా ఓ సినిమా చేసుకుని రమ్మంటారా? ఇలా చాలా ప్రశ్నలకు బన్నీ వైపు నుంచే త్రివిక్రమ్ కు క్లారిటీ రావాల్సి వుంది. అంత వరకు అదిగో త్రివిక్రమ్.. ఇదిగో హీరో అంటూ గ్యాసిప్ లు వినిపిస్తూనే వుంటాయి.
ఈ టెన్షన్ తో పోయేలా ఉన్నావ్ . టైం కి మాత్రలు గట్రా వేసుకుని పడుకో . వెధవ సోది .
Anna khaline kadha… Anna tho chesthe pola
Tamil SURIYA ni try cheyyi, it will be a big boost to both director and hero