ప్రభాస్ కేరాఫ్ ఇటలీ

బాహుబలి ప్రభాస్ ఇప్పుడు సమ్మర్ హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటలీలోని ఓ విలేజ్ లాంటి ప్రాంతంలోని ఇంట్లో సేద తీరుతున్నారు.

బాహుబలి ప్రభాస్ ఇప్పుడు సమ్మర్ హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటలీలోని ఓ విలేజ్ లాంటి ప్రాంతంలోని ఇంట్లో సేద తీరుతున్నారు. వేసవి ముగిసే వరకు ఆయన మళ్లీ సెట్ మీదకు రాకపోవచ్చు. లైన్ లో వున్న రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్ లు పెండింగ్ లో వున్నాయి. రాజా సాబ్ కు పాటలు, కొన్ని రోజులు షూట్ పెండింగ్ వుంది. ఫౌజీ పనులు చాలా వున్నాయి.

రాజాసాబ్ టీజర్ ఇంకా రాలేదు. దర్శకుడు మారుతి కట్ చేసిన టీజర్ కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాన్ని విడుదల చేయాల్సి వుంది. ఈ ఏడాదికి కేవలం రాజాసాబ్ మాత్రమే విడుదలయ్యే అవకాశం వుంది. అది కూడా దసరా లోగా విడుదలైతే. లేదంటే ఇంక వచ్చే ఏడాది సంక్రాంతికే.

పౌజీ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కు రావచ్చు అని టాక్. నిజానికి సందీప్ వంగా సినిమా సెట్ మీదకు వెళ్లాలి. దాన్ని 2026 సమ్మర్ కు అని టాక్ వుంది. కానీ మధ్యలో ఫౌజీ సంగతి తేలాల్సి వుంది.

ఇలా చేతిలో వున్న మూడు సినిమాలు పూర్తి అయితే సలార్ 2 సినిమా మీద ప్రభాస్ వెళ్లాలి. ఈ లోగా ఎన్ని సమ్మర్ లు వస్తాయో.. ఎన్ని సార్లు ప్రభాస్ ఇటలీకి విశ్రాంతికి వెళ్తారో?

3 Replies to “ప్రభాస్ కేరాఫ్ ఇటలీ”

Comments are closed.